2025 ఐపీఎల్ ఛాంపియన్ ట్రోపిని రాయల్ చాలెంజెస్ బెంగళూరు గెలవడం జరిగింది. ఆర్సిబిలో కీలక బౌలర్గా పేరుపొందిన యశ్ దయాల్ తాజాగా చిక్కుల్లో పడ్డట్టుగా వినిపిస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ఒక యువతి యశ్ దయాల్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది.. ముఖ్యంగా తనని వివాహం చేసుకుంటానని మోసం చేశారని ఘజియాబాద్ కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో అతని పైన భారత న్యాయ ప్రకారం సెక్షన్ 69 కింద కేసు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది.


ఒకవేళ ఈ ఆరోపణలు కనుక నిజమైతే.. ఈ బౌలర్ కి పదేళ్లపాటు జైలు శిక్ష పడడం ఖాయమని పోలీసులు వెల్లడిస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి కూడా తనని యశ్ దయాల్ మోసం చేశారని ఆ మహిళ బాధితురాలు తెలియజేసింది. దీంతో కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ కూడా పోలీసులు చేపడుతున్నారు. దయాల్ పైన కేసు పెట్టిన యువతి సంచలన విషయాలను ఫిర్యాదులు తెలియజేసినట్లు వెల్లడించింది. దయాల్  తనతో సుమారుగా 5 ఏళ్ల పాటు రిలేషన్ లో ఉన్నారని.. తనని వాళ్ళ కుటుంబానికి కూడా పరిచయం చేశారని దీనితో తనని వివాహం చేసుకుంటానని నమ్మాను కాని తన మోసం చేశాడంటే తెలిసింది.


అంతేకాకుండా అటు మానసికంగా, శారీరకంగా ఆర్థికంగా కూడా తనని చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆ యువత తెలిపిందట. చివరికి అతడి దురుద్దేశాన్ని తాను అర్థం చేసుకున్న తర్వాతే తాను ప్రశ్నించాను అప్పటినుంచి తనని హింసించడం మొదలు పెట్టారంటూ ఆ కంప్లైంట్ లో వెల్లడించింది.యశ్ దయాల్ తనను వేధించడానికి సాక్ష్యంగా తమ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక చాట్ రికార్డు, స్క్రీన్ షాట్, వీడియో కాల్ రికార్డింగ్లు వంటివి అలాగే కొన్ని ఫోటోలను కూడా ఆమె పోలీసులకు సమర్పించింది. మరి ఈ విషయం పైన దయాల్ కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: