మన ఇండియన్స్ అన్ని గేమ్స్ కంటే కూడా క్రికెట్ చూడడానికి ఆడడానికి అత్యంత ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. దానితో మన టీమ్ ఇండియా జట్టు ఏ ఫార్మేట్ లో మ్యాచ్ ఆడినా కూడా అత్యధిక రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది. ఇక టీమ్ ఇండియా జట్టు పాకిస్తాన్ తో కనుక తలపడినట్లయితే ఆ మ్యాచ్ కి ఉండే క్రేజే వేరు. ఇండియా ,  పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఆ మ్యాచ్ కి అద్భుతమైన క్రేజ్ ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఆ మ్యాచ్ ను చూడడానికి భారతీయులు అత్యంత ఆసక్తిని చూపిస్తారు. అలాగే ఏ మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు కానీ పాకిస్తాన్ తో మాత్రం అస్సలు మ్యాచ్ ఓడిపోకూడదు అనే ఉద్దేశంలో అనేక మంది భారతీయ అభిమానులు ఉంటూ ఉంటారు.

ఇక ఇండియా , పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు ఆ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు అదిరిపోయే రేంజ్ లో సేల్ అవుతుంది ఉంటాయి. ఇలా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అంటే చాలు అలా టికెట్స్ మొత్తం క్లోజ్ అవుతూ ఉంటాయి. లేకపోతే తాజాగా ఆసియా కప్ 2025 ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో సెప్టెంబర్ 14 వ తేదీన ఇండియా , పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇండియా , పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు అదిరిపోయే రేంజ్ లో సేల్ అవుతాయి అని చాలా మంది అనుకున్నారు.

కానీ అలా సేల్ కావడం లేదు. ఇప్పటికి సగానికి పైగా టికెట్లు సేల్ కాకుండా ఉన్నయి. మరి ఎందుకు ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు సేల్ కావడం లేదు అనే అనుమానాలు చాలా మంది లో వ్యక్తం అవుతున్నాయి. అందుకు ప్రధాన కారణాలు కేవలం ఇండియా , పాకిస్తాన్ మ్యాచ్ చూడాలి అనుకునే టికెట్లు బుక్ చేసుకుంటే అసలు కావు. గ్రూప్ ఏ ఇండియన్ , పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. మనం ఇండియా , పాకిస్తాన్ మ్యాచ్ చూడాలి అనుకుంటే గ్రూప్ ఏ లో ఉన్న అన్ని మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను కొనాలి. అందుకు ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణాలతో ఇండియా , పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు భారీ ఎత్తున సేల్ కావడం లేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: