క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చే వార్త ఇది! మహేంద్ర సింగ్ ధోనీ... ఈ పేరు వింటే చాలు స్టేడియం అంతా ఉత్సాహంతో దద్దరిల్లిపోతుంది. ఆయన ఎంట్రీ అంటే ఓ పండుగే. మైదానంలో పసుపు జెర్సీ వేసుకుని ధోనీ క్రీజ్‌లోకి అడుగుపెడితే - డీజే సౌండ్ కంటే అభిమానుల గోలే ఎక్కువగా వినిపిస్తుంది. “థలా” అని కేకలు వేసే అభిమానులు ప్రతి షాట్‌ను గుండెల్లో దాచుకుంటారు. అంతగా అభిమానుల మనసుల్లో చోటు దక్కించుకున్న ధోనీ ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాడన్న వార్తలు క్రికెట్ ప్రపంచంలో హల్‌చల్ సృష్టిస్తున్నాయి. ధోనీ వయసు ఇప్పుడు 44 సంవత్సరాలు. అంతటి వయసులోనూ ఫిట్‌గా, ఫైర్‌గా ఆడుతున్నా... శరీరం మాత్రం తన హద్దులు చూపిస్తోంది. అందుకే ఈ సారి వచ్చే ఐపీఎల్ 2026 సీజన్‌నే ధోనీ చివరిసారిగా ఆడే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
 

మొన్నటి వరకు ఈ సీజన్‌తో రిటైర్మెంట్ అనుకున్నా, ధోనీ అభిమానుల కోసం మరోసారి పసుపు జెర్సీ వేసుకోనున్నాడట. కానీ అదే “ఫైనల్ రన్” అవుతుందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వార్తను మరింత బలపరుస్తున్న మరో అంశం కూడా బయటకు వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఇప్పుడు కొత్త వికెట్ కీపర్–బ్యాటర్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ఆ జాబితాలో ముందున్న పేరు - సంజూ శాంసన్! రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా మెరిసిన సంజూ శాంసన్‌ను సీఎస్కే తమ జట్టులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట. సంజూ బ్యాటింగ్, కీపింగ్ రెండింటినీ సమతుల్యంగా చేయగలడనే నమ్మకం సీఎస్కే యాజమాన్యానికి కలిగిందని క్రికెట్ సర్కిల్‌లో చర్చ. అంటే స్పష్టంగా చెప్పాలంటే, సంజూ శాంసన్ సీఎస్కేలోకి వస్తే, ధోనీ నిష్క్రమణ దాదాపు ఖాయం!

 

ఈ వార్త ధోనీ అభిమానుల హృదయాలను ముక్కలుగా చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గత 15 ఏళ్లుగా సీఎస్కేకు ఓ ప్రతీకగా నిలిచిన ధోనీ లేకుండా పసుపు జెర్సీని ఊహించుకోవడం కష్టమే. ధోనీ కెప్టెన్సీ అంటే వ్యూహం, ధైర్యం, కూల్‌మెంట్ అన్నీ కలిసిన మంత్రం. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే గెలిచిన ట్రోఫీలు ఆయన దార్శనికతకే సాక్ష్యం. అలాంటి లెజెండ్ ఇక మైదానంలో కనబడకపోవడం అభిమానులకు నిజంగా హార్ట్ బ్రేకింగ్ క్షణం. మొత్తం మీద, “థలా ధోనీ చివరి సీజన్ స్టార్ట్ అవుతోంది...” అనే మాట క్రికెట్ అభిమానుల గుండెల్లో ఒకేసారి గర్వం, బాధ, భావోద్వేగం కలగలిపినదిగా మారింది. ధోనీ మైదానం నుంచి తప్పుకుంటే కూడా - ఆయన జ్ఞాపకం మాత్రం ప్రతి అభిమానిలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: