భారత్ లో క్రికెట్ క్రేజ్ పీక్స్ లో ఉంటుంది. క్రికెట్ ను డామినేట్ చేసే ఆట మరొకటి లేదు. ప్రత్యర్ధి ఏదైనా, ఆడేది ఎక్కడైనా సరే.. టీమ్ కి సపోర్ట్ చేయడానికి వాలిపోయే అభిమానులు కోకొల్లలు. ఈ 2019 వరల్డ్ కప్ లో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో స్టేడియం కెపాసిటీ 26 వేలు వుంటే టికెట్ల కోసం 5 లక్షల మందికి పైగా పోటీ పడ్డారంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఈ టోర్నీలో భారత్ అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. ఇదే స్పీడుతో , ఇంతే జాగ్రత్తతో ఆడితే కప్ సాధించడం కష్టమేమీ కాదు. అయితే..

 


సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2003లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లను ఓసారి గుర్తుతెచ్చుకోవాలి. నౌ ఆర్ నెవర్ అనే నినాదంతో ఎలాగైనా కప్ గెలవాలన్న కసితో ఆటగాళ్లున్నారు. సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రవిడ్, హర్భజన్, శ్రీనాధ్, కుంబ్లే, జహీర్ ఖాన్, మహ్మద్ ఖైఫ్, అగార్కర్.. వంటి హేమా హేమీల్లాంటి ఆటగాళ్లున్న జట్టు. విపరీతమైన అంచనాలు, అంతకుమించి ఒత్తిడి. లీగ్ లో ఆస్ట్రేలియాతో ఓడిపోయి అనేక విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఫేవరేట్లమన్న మత్తు వదిలించుకుని అన్ని మ్యాచ్ ల్లో నెగ్గి ఫైనల్ కు వెళ్లారు. ఫైనల్ లో మళ్లీ ఆస్ట్రేలియా. రెండు జట్ల బలా బలాలు ఒకే స్థాయిలో ఉన్నా ఆసీస్ విసిరిన 359 లక్ష్యాన్ని చేధించలేక 234 పరుగులకే ఆలౌటైంది. ఇక్కడ విషయమేమిటంటే..

 



2003 తరహాలోనే ఇప్పుడు కూడా భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. అప్పటిలా వరుస విజయాలతో ఉన్నామనుకుంటే ఇప్పటిలా ఆఫ్గనిస్థాన్ తో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు కాకుండా ఉంటుంది. ప్రతి ఆటగాడు తమ స్థాయి ప్రదర్శన చేయాలి. ఆనాడు ఫైనల్ లో ఒత్తిడి తట్టుకోలేక ఎప్పుడూ రన్నరప్ గా వచ్చే సచిన్ తో ఓపెనింగ్ చేయిస్తే 4 పరుగులకే ఔటయ్యాడు. మిగిలిన ఆటగాళ్లూ లైన్ కట్టేశారు. ఆ మ్యాచ్ పై వెస్టీండీస్ ఆటగాడు లారా.. “సచిన్ అవుటవగానే టీవీ ఆఫ్ చేసేసాను.. తరువాత ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి” అన్నాడు. అంటే ఆ సమయంలో భారత్ మీద ఎలాంటి అంచనాలు, ఒత్తిడి ఉన్నాయో గమనించవచ్చు. ఇప్పుడూ ఫేవరేటే. వరుస విజయాలు వస్తున్నాయి. వీటిని పక్కనపెట్టాలి. ఈ ఆట గెలవాలి అని మాత్రమే ఆలోచించాలి. మరి కోహ్లీ సేన వీటిని పాటిస్తుందా! కోట్లాది మంది ఆశల్ని మోస్తున్న ఆ పదకొండు మంది భారత్ కు కప్ తేవాలంటే ఇకనుంచి మరింత జాగ్రత్తగా ఆడక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: