బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారం సమంత సందడి తో మొదలైన ప్రయాణం సరదాగా సాగుతూ చివరికి మరొక ఇంటి సభ్యురాలి ఎలిమినేషన్ తో ఎపిసోడ్ ముగిసింది. ఈ వారం ఎలిమినేషన్‌ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో లాస్య మరియు దివి మధ్య చర్చ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. కొంత సేపు డిస్కషన్ తరువాత, ఇకనైనా వారిరువురి మధ్య మనస్పర్థలు తొలగిపోవాలని .. లాస్య కోసం దివి స్వయంగా నామినేట్ చేసుకొన్నారు. దాంతో ఆమె మరోసారి ఎలిమినేషన్ జోన్ లో చిక్కుకుంది. కానీ ఊహించని పరిణామాలతో చివరికి ఇంటిలో నుండి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది...దసరా పండుగ రోజు బిగ్ బాస్ ఇంటిలో కంటతడి పెట్టించింది.

ఈ ఆదివారం బిగ్ బాస్ ఇంటి అభిమానులను అలరించడానికి సమంత అక్కినేని స్టేజ్ పై అల్లరి చేశారు. దసరా పండుగ సందర్భంగా జరిగిన స్పెషల్ ఎపిసోడ్‌లో సమంత అక్కినేని ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూనే మరోవైపు అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. ఇంటిలోని సభ్యులను ఆటపాటలతో ఆనందంలో ముంచుతూ.. అరియానా, మోనాల్, అభిజిత్, నోయల్ ని సేవ్ చేశారు. చివరకు అవినాష్, దివి మిగిలారు. దాంతో వారిద్దరిక మధ్యన  అసలైన టెన్షన్ మొదలైంది. చివరికి అవినాష్ సేఫ్ కాగా, దివి ఇంటిని వదిలి వెళ్ళిపోయారు.

దివి ఎలిమినేట్ కావడానికి ముందు పెద్ద సస్పెన్సే కొనసాగింది.... నామినేషన్ లో ఉన్న వారందరూ టెన్షన్ తో హడలెత్తి పోయారు. ముందుగా అరియానా, అభిజిత్, నోయల్, అవినాష్, మోనాల్ సేవ్ అయ్యారు. చివరికి దివి అవుటయ్యారు. దివి ఎలిమినేట్ కావడం అందర్నీ షాక్ కు గురి చేసింది.  ఎప్పుడూ సరదాగా సందడిగా కనిపించే సమంత అక్కినేని కూడా భావోద్వేగానికి గురైనట్టు కనిపించారు. అయితే ఎపిసోడు మొదట్లో ఇంటి సభ్యులు ఊహించినట్టు ఈ వరజం ఎలిమినేషన్ ఉండదు అనుకున్నారు...కానీ బిగ్ బాస్ ఎవరూ ఊహించనిదే చేయడం పరిపాటి...దివి వెల్తూ వెల్తూ లాస్య పైన బిగ్ బాంబ్ వేసి వెళ్ళింది. దీనితో సమంతా కూడా ఓకే... నీ ఎలిమినేషన్ కు కారణమైందని బిగ్ బాంబ్ వేశావు కదా అని ఆటపట్టించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: