
ఇక్కడ స్పెషల్ ఏమిటంటే పులిహోర రాజా లతో పాటుగా పులిహోర రాణులు కూడా ఎక్కువే... అదీ వాళ్లు పులిహోర మామూలుగా కలపడం లేదుగా. అదేనండి ఓ వైపు మామయ్యగా రవి లహరిని ఇచ్చి పెళ్లి చేయమని నానా తంటాలు పడుతున్నాడు. మరో వైపు మానస్ కూడా లహరి వెంటే పడుతున్నాడు. సిరి ఏమో చిన్ననాటి స్నేహితురాలు పాత్రలో తన ప్రేమను శ్రీ రామ చంద్రతో చెప్పి ఒప్పుకోమని తెగ ఇబ్బంది పెడుతోంది. మరో వైపు సన్ని, ప్రియాంక ల ప్రేమ సన్నివేశాలు ఆ కాలుజారి పడటాలు బాబోయ్ ఎపిసోడ్ కే హైలెట్. ఇక ఇంకో వైపు పెళ్లిళ్ల పేరయ్య గా షణ్ముక్ ఆయన అసిస్టెంట్ గా లోబో, శ్వేత వర్మలు చేస్తుండగా, ఇటు షణ్ముక్ అటు లోబో ఇద్దరు కూడా శ్వేత కోసం కలుపుతున్న పులిహోర అంతా ఇంతా కాదు.
వీరి మధ్య కామెడీ తెగ పండుతోంది. శ్వేత ఏమైనా తక్కువ తిందా కాసేపు షణ్ముక్ కి దగ్గర గా ఉంటుంది. ఇంకాసేపు లోబో మాటలకు అట్రాక్ట్ అవుతుంది. ఈ మధ్యలో వీరి మాటల గారడీ ప్రేక్షకుల్ని బాగా నవ్వించింది. యాని మాస్టర్ పెళ్లి కూతురి తల్లిగా కూతుర్ని దారిలో పెట్టేందుకు చూస్తోంది. తన మాటే వేదం అనేలా చేస్తుంటే మరో వైపు లహరి మాత్రం పైకి మీ ఇష్టం మమ్మీ అంటూ ఇటు మానస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. వీరిద్దరి మధ్య కూడా ఎంటర్టైన్మెంట్ బాగా నడుస్తోంది.