ఈటీవీలో ఎప్పటినుంచో ప్రసారమవుతున్న అత్తారింటికి దారేది సీరియల్ ఈ మధ్య మంచి పాపులారిటీని తెచ్చుకుంటోంది.. అంతేకాదు ఈ సీరియల్ లో నటించే నటీనటులు కూడా ఎప్పటికప్పుడు కొత్త వాళ్లు రావడం ప్రేక్షకులకు మరింత ఆసక్తినీ పెంచుతున్నారు.. ఇకపోతే ఈ సీరియల్ లో సాత్విక అనే అమ్మాయి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. ఈమె మోడ్రన్ గా కనిపిస్తూ తన మాటలతో, నటనతో అందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది. సాత్విక బుల్లితెరపై అడుగు పెట్టక ముందు మొదట వెండితెరపై పది సినిమాలకు పైగా నటించి ఆతర్వాత బుల్లితెరపై అడుగుపెట్టింది. ఇక ప్రస్తుతం అత్తారింటికి దారేది సీరియల్ లో విలన్ పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు పొందుతోంది.

ఇకపోతే సాత్విక రియల్ లైఫ్ స్టోరీ విషయానికి వస్తే.. సాత్విక అసలు పేరు అవంతిక మున్ని. మే 13వ తేదీన కాకినాడలో జన్మించింది. అవంతిక మన తెలుగమ్మాయే. అవంతిక కు చిన్ననాటి నుంచి నటన మీద ఆసక్తి ఎక్కువ. చదువు పూర్తి కాగానే వెండితెర మీద తన నటనను మొదలు పెట్టింది. మొదటిసారి ప్రాణం ఖరీదు అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. రొమాంటిక్ క్రిమినల్స్, బీకాంలో ఫిజిక్స్, ఐపీఎల్ T 20, అబ్బో నా పెళ్ళంట, మరో దృశ్యం వంటి సినిమాలలో అవంతిక నటించి తనదైన శైలిలో తన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించింది.

యువతకు బాగా దగ్గరైన అవంతిక ప్రణయం, నేను శైలజ వంటి షార్ట్ ఫిలిమ్స్ లో కూడా అవంతిక నటించింది. ప్రస్తుతం బుల్లితెరపై అత్తారింటికి దారేది అనే సీరియల్ ద్వారా విలన్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. అవంతిక ఈ సీరియల్లో మంచి నటనను కనబరిచి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.. అంతేకాదు ఈమెకు మరిన్ని సీరియల్ అవకాశాలు కూడా రావాలని, త్వరలో ని స్టార్ పొజిషన్ కు చేరుకోవాలని మనం కూడా మనస్పూర్తిగా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: