అదేనండి ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టుకొచ్చి టాప్ ఫైవ్ లో ఒకరం అని పేరు లేకుండానే ఇంటి నుండి ఎలిమినేట్ అయిపోతే ఎలా ఉంటుంది. కాగా ఈ సోమవారం నామినేట్ అయిన వారిలో ఒకరు ప్రజల ఓటింగ్ ను బట్టి ఇంటి నుండి ఔట్ అవుతారు. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ కోసం 1,2,3,4,5,6 రాంక్ లను పెట్టి ఎవరు ఏ స్థానం వద్ద అర్హులో వారినే నిర్ణయించుకొని అయా స్థానాల వద్ద నిల్చోమని చెప్పారు. మామూలుగా గత సీజన్ల లో అప్పుడు కూడా ఇలాంటి గేమ్ నడిచింది. అపుడు మొదటి 1,2,3 స్థానలలో నిల్చోవడానికి తాము అర్హులమని రచ్చరచ్చ చేసే వారు. కొన్ని సార్లు చివరి వరకు వడించుకుంటూనే అందరూ నామినేట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే ఇపుడేమో సీజన్ ఫైవ్ లో మిగిలిన ఆరు సభ్యులు ఎదో ఆడాలంటే ఆడాలి అన్నట్టుగా ఆడారు. ఈ స్థానాల్లో మనల్ని నిలబెట్టేది ప్రజలు. మనం అనుకుంటే సరిపోదు అంటూ భారీ డైలాగులతో స్ట్రాటజీలను ఉపయోగించేశారు. ఒక్క కాజల్ తప్ప మిగిలిన వారు నువ్వా నేనా అన్న పోటీ లేకుండానే ఎక్కడో అక్కడ నిలుచున్నారు. చివరికి బిగ్ బాస్ ఏమో టికెట్టు ఫినాలే అందుకున్న శ్రీ రామ చంద్ర తప్ప మిగిలిన వారంతా నామినేట్ అయ్యారు అని షాక్ ఇచ్చారు.