యాంకర్ గా బుల్లితెరను కొన్నేళ్లపాటు ఏలిన ఈమె ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా గ్లామర్ విషయంలో ఏ మాత్రం తీసిపోదు. ఇకపోతే యాంకరింగ్ వద్దు అనుకొని సినిమాలపైనే ఫోకస్ చేసిన ఈమె అతి తక్కువ సమయంలోనే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యింది. రంగస్థలం రంగమ్మత్తగా, పుష్ప సినిమాలో ద్రాక్షాయిణిగా ఇలా పలు పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈమె తన నటనతో అద్భుతమైన నటి అనిపించుకుంది. ముఖ్యంగా తాను ఎంచుకున్న పాత్రల తీరు కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రతి పాత్ర కూడా వైవిధ్యంగా ఉండేలాగా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా అనసూయ సక్సెస్ వెనుక ఆమె పాత్రల ఎంపిక కూడా ఉందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ప్రేమ విమానం అనే సినిమాలో అద్భుతంగా నటించింది.
ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే ఈమె చేసిన ప్రతి పాత్రకి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పాలి. అలా తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ ఆ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె చేతిలో ఇప్పుడు దాదాపు చాలా సినిమాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రతి సినిమాలో కూడా విభిన్నమైన పాత్ర ఎంచుకున్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి