మొదట మెజీషియన్ గా తన కెరీయర్ని సాధించి ఆ తర్వాత జబర్దస్త్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న బుల్లితెర హీరో సుడిగాలి సుదీర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం తో వచ్చిన పాపులారిటీతో హీరోగా మారి పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు. బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించిన సుడిగాలి సుదీర్ యాంకర్ గా కూడా పలు షోలకు చేయడం జరిగింది. సుధీర్ కు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ప్రతి సినిమాకి తనలోని కొత్త మేనరిజాన్ని చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.


వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సుధీర్ త్వరలోనే కాలింగ్ సహస్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా రేపటి రోజున విడుదల కాబోతోంది.ఈ సినిమా రిలీజ్ వేడుకకు హాజరు కావడం జరిగింది సుధీర్. ఇందులో భాగంగా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.. తనకు ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు సైతం కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం తన స్నేహితులు గెటప్ శ్రీను, వేణు అన్న దగ్గరకు వెళ్ళమని సలహా ఇవ్వకపోతే మల్లెమాల టీం జబర్దస్త్ లేకపోతే మీ అభిమానం లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదంటూ తెలిపారు.ఇలా తనను ఇంతగా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు అభిమానులకు సైతం ఎన్ని జన్మలెత్తిన రుణాన్ని తీర్చుకోలేని అంటూ సుధీర్ ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ కామెంట్స్ చేయడం జరిగింది. గాలోడు సినిమా మీ అభిమానం వల్లే హిట్ అయిందని ఇంతకన్నా మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని తన శ్రేయోభిలాషులు సలహా ఇవ్వడంతోనే ఇలా సరికొత్త కథలతో మీ ముందుకు వస్తున్నానంటే తెలియజేశారు సుధీర్. ప్రస్తుతం సుదీర్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: