తాజాగా తెలుగు బిగ్ బాస్-7 విన్నర్ రైతుబిడ్డ కామన్ మ్యాన్ కింద పల్లవి ప్రశాంత్ విన్నర్ గా గెలిచిన సంగతి తెలిసినదే.. ఈ షో ముగిసిన తర్వాత నుంచి ఎక్కువగా కాంట్రవర్సీలు ఒకదాని పైన ఒకటి ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ప్రశాంత్ గెలిచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు చాలా చర్చినియంశంగా మారుతున్నాయి.. ముఖ్యంగా అభిమానులు ఓవరాక్షన్ తో కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం చేయడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా పలువురు మాజీ కంటెస్టెంట్ల కార్ల అద్దాలను కూడా పగలగొట్టడంతో గీతు రాయల్ తదితర వంటి వారు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగినది.


ట్రోఫీ గెలిచి ఇంటికి వెళుతున్న ప్రశాంత్ ను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు సైతం పంపించారు. ఈ విషయం పైన పలువురు స్పందిస్తూ పల్లవి ప్రశాంత్ స్టేషన్లో వేయడం మంచి పని అంటూ మరి కొంతమంది స్పందిస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ విషాదం పైన ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మాట్లాడడం జరిగింది. తన కుమారుడిని అరెస్టు చేసి తమకు సంతోషం లేకుండా చేస్తున్నారంటూ ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకున్నారు.


ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ తన కొడుకు బిగ్బాస్ విన్నర్ అయినందుకు మురిసిపోయిన ట్రోఫీ గెలిచిన ఐదు గంటలకి ఇలాంటి బాధను సైతం తమకు అందించడం ఎందుకని వ్యవసాయం చేసుకుంటే సరిపోలేదని.. మా ఊర్లో ఉండి ఉంటే బాగుండు లేనిపోని సృష్టించి తనపైన వార్తలు రాస్తున్నారంటూ తెలుపుతున్నారు.. ప్రశాంత్ పక్కనే తాను కూడా ఉన్నానని తెలుపుతూ.. అక్కడే తనకు వాంతులు కూడా అయ్యాయని తన కొడుకుకి ఎలాంటి గొడవలతో సంబంధం లేదని అదే ఒక సెలబ్రిటీ గెలిచి ఉంటే ఇలా చేస్తారా.. రైతు బిడ్డ కాబట్టే ఇలా చేస్తున్నారని.. కానీ కొందరు కావాలని పారిపోయారు అంటూ పలు రకాల రూమర్స్ సృష్టించారని తెలిపారు.. తమది మారుమూల గ్రామం అని బెయిల్ విషయం కూడా తమకు ఏమీ తెలియదని తన భార్యకు కూడా ఆరోగ్యం బాగా లేదంటూ కన్నీరు పెట్టుకుంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: