తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక మంచి క్రేజీ ను అందుకున్నటువంటి యాంకర్లలో విష్ణుప్రియ కూడా ఒకరు.. ఈమె ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించింది. అయితే ఇటీవల కాలంలో బుల్లితెర పైన పెద్దగా కనిపించలేదు కానీ అడపా దడపా వెబ్ సిరీస్లలో మాత్రమే కనిపిస్తోంది.మరొకవైపు ప్రైవేట్ ఆల్బమ్లలో కూడా చేస్తూ తన కెరియర్ పరంగా బిజీగా ఉంటుంది విష్ణు ప్రియ.. ఇలా తన జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయంలో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ..

తరచూ జిమ్ వర్క్ అవుట్లతో లేకపోతే తన  స్నేహితులతో కలిసి వెకేషన్ కి వెళ్లడం వంటివి చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేసేటువంటి వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదంతా ఇలా ఉండక అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేస్తూ తనకు సంబంధించిన విషయాలను సైతం పంచుకుంటూ ఉంటుంది.. విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా ఈమె కుర్చీ మడతపెట్టి అనే సాంగ్కు డాన్స్ ప్లాన్ చేయాలని చేస్తున్నామంటూ అందుకు సంబంధించి స్టెప్స్ ఉన్నటువంటి ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలలో షేర్ చేయడం జరిగింది.

అయితే ఈ వీడియో వైరల్ గా మారడంతో విష్ణు ప్రియ అభిమానుల సైతం ఈ డాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.. మహేష్ శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం చిత్రంలోనిది ఈ పాట. ఈ సినిమా నుంచి ఈ పాటను విడుదల చేయక ఒక్కసారిగా భారీ పాపులారిటీ అందుకుంది. సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ గా మారుతోంది ఈ పాట.. దీంతో చాలామంది సెలబ్రిటీలు ఈ పాటకి రీల్స్ చేస్తూ తెగ వైరల్ గా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాము కూడా ఈ పాటకి డాన్స్ ప్లాన్ చేస్తున్నామంటూ విష్ణు ప్రియ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: