తెలుగు బుల్లితెరపై నటిగా మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి తేజస్విని గౌడ కూడా ఒకరు.. ప్రస్తుతం ఇమే బుల్లితెర పై పలు సీరియల్స్ లో నటిస్తున్నప్పటికీ నటుడు అమర్ దిప్ చౌదరిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఇలా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇటీవల అమర్ దిప్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఆయన పట్ల చాలా నెగిటివిటీ వచ్చినా కూడా తేజస్విని మాత్రం చాలా ఓపికగా సహనంతో అలాంటి విషయాలను భరించింది.. తాజాగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఈమె మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.


ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని తమ ప్రేమ గురించి తెలియజేస్తూ కోయిలమ్మ సీరియల్ నటిస్తున్న సమయంలో మొదట అమరదీప్ తనకి ప్రపోజ్ చేశారంటూ దాంతో తాను కూడా ప్రేమను రిజెక్ట్ చేశానని.. కానీ మూడు సంవత్సరాల పాటు అమర్ తనని ప్రేమిస్తూ పిచ్చోడిలా తిరుగుతూ ఉన్నారని మూడేళ్ల తర్వాత మరొకసారి ప్రపోజ్ చేయడంతోపాటు తానే వచ్చి మా ఇంట్లో వాళ్లతో మాట్లాడతానని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా లేకపోతే మర్చిపోతానని చెప్పాడట.


అలా వచ్చి తన ఫ్యామిలీతో మాట్లాడారని ఇద్దరికీ ఇష్టం ఉండడంతో పెళ్లికి ఒప్పుకున్నారని తెలిపింది.అమర్ బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చాలా నరకమే అనుభవించాను అంటూ తెలియజేసింది తేజస్విని.. చాలా మంది తన భర్త పైన నెగిటివ్గానే ప్రచారం చేశారని తన గురించి వస్తున్నటువంటి నెగటివ్ ని చూసి చాలా బాధపడ్డాను అంటూ కూడా తెలిపింది..ఆ లైవ్ చూడాలంటేనే తనకు భయం వేసేదని బిగ్ బాస్ ఒక కర్మ అని ఎప్పుడెప్పుడు ఈ షో అయిపోతుందా అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూశాను అంటూ తెలిపింది. ఇకపై భవిష్యత్తులో తాను కూడా బిగ్ బాస్ షో గురించి కానీ ఆ షో కి వెళ్లడం కానీ జరగదు అంటూ తెలియజేసింది తేజస్విని గౌడ.

మరింత సమాచారం తెలుసుకోండి: