సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో నటి సౌమ్య శెట్టి కూడా ఒకరు.. ఈమెది వైజాగ్ అయినప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో నిత్యం హాట్ వీడియోలను రీల్స్ ను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. అలాగే కొన్ని రకాల షార్ట్ ఫిలిం లతో పాటు చిన్న చిన్న సినిమాలలో నటించింది. అందులో కూడా బోల్డ్ సన్నివేశాలతో కుర్రకారులను పిచ్చెక్కిస్తూ ఉంటుంది.. అయితే సోషల్ మీడియాలో పరిచయం అయిన స్నేహితురాలు ఇంటికి వెళ్లి మరి.. ఎవరికి తెలియకుండా బంగారం కొట్టేసిందట. వీటిని అమ్మేసి మరి గోవాకి ముఖం మార్చేసి అక్కడ జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేస్తూందట.

హీటెక్కించే రీల్స్ తో రెచ్చిపోతున్న ఈ ముద్దుగుమ్మ ఆరా తీయగా అసలు విషయం బయట పడడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే విశాఖ నగరంలో ఉన్న దొండపర్తి బాలాజీ మెట్రో అపార్ట్మెంట్లో..102 పోస్టల్ శాఖ రిటైర్డ్ అధికారి ప్రసాద్ బాబు తన కుమార్తె మౌనికతో కలిసి నివాసం ఉంటున్నారు.. వీరు ఫిబ్రవరి 23న మలమంచిలి బంధువుల వివాహానికి వెళ్లగా.. ఈ క్రమంలోనే బంగారు ఆభరణాల కోసం బీరువా లాకర్స్ ను తెరవగా అందులో 150 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదట..


దీంతో వెంటనే ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో బీరువాపైన ఉండే వేరే ముద్రలను సైతం సేకరించి ప్రసాద్ బాబు ఆయన కుమార్తెలను పోలీసులు వివరించారు.. అయితే ఇటీవలే వాళ్ళింట్లో వచ్చిన కొందరి పైన అనుమానం ఉందంటూ కూడా తెలియజేయడంతో జనవరి 29 ఫిబ్రవరి 19 తేదీలలో తన కుమార్తె స్నేహితులైన భార్యాభర్తలు మరికొంతమంది తమ ఇంటికి వచ్చారని.. బాత్రూం కి వెళ్లాలని సాకుతో బెడ్ రూమ్ లోకి వెళ్లి కొద్దిసేపు తర్వాత బయటికి వచ్చారంటూ మౌనిక వెల్లడించింది.. అలా పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి 11 మంది అనుమానితుల పైన దర్యాప్తు చేయగా ఇందులో ముగ్గురు అదుపులోకి తీసుకున్నారని ఈ క్రమంలోనే ఈ నటి పేరు కూడా బయటికి వచ్చింది. దీంతో ప్రధాన నిందితురాలుగా ఈమెను గుర్తించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: