బుల్లితెర జంటలలో అమరదీప్, తేజస్విని జంట గురించి చెప్పాల్సిన పనిలేదు. కర్ణాటక ప్రాంతానికి చెందిన తేజస్విని  చిన్ని అనే సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ఆ తర్వాత అటు కన్నడ,తెలుగు ఇండస్ట్రీలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అమర్దీప్ కూడా సీరియల్ ద్వారానే హీరోగా పాపులారిటీ సంపాదించారు. ఆ తరువాతే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నప్పటికీ విన్నర్ కాలేకపోయారు. తేజస్విని, అమర్దీప్ సీరియల్ లో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

అలా 2022లో పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నో షోలకు ప్రోగ్రాములకు జంటగా హాజరయ్యి  బాగా అలరిస్తూ ఉండేవారు. ఇటీవలే ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఇస్మార్ట్ జోడిలో కూడా పాల్గొనడం జరిగింది. తాజాగా తేజస్విని జబర్దస్త్ వర్ష హొస్టుగా చేస్తున్నటువంటి కిస్సిక్ టాక్ షో కి గెస్ట్ గా హాజరయ్యింది. అయితే ఇందులో తేజస్విని తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకోవడం జరిగింది.


ముఖ్యంగా గత కొద్దిరోజులుగా విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయని అయితే ఏ మొగుడు పెళ్ళాల మధ్య ఆయన కూడా గొడవలు సహజంగానే ఉంటాయి అలా మా మధ్య కూడా ఉన్నాయి కానీ మేము విడిపోలేదు అంటూ తెలియజేసింది. మేము త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ తీసుకోబోతున్నాం అంటూ తెలియజేసింది. తన భర్త అమర్దీప్ కు అమ్మాయి కావాలని తనకు కూడా ముందు నుంచి అమ్మాయి పుట్టాలని కోరిక ఉన్నదంటూ తెలియజేసింది తేజస్విని. మొత్తానికి ఇలా విడాకుల వ్యవహారంతో ఈ బుల్లితెర జంట గుడ్ న్యూస్ చెప్పడంతో అభిమానులు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఈ విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు. ఎందుకు సంబంధించి ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. మరి ఇకనైనా ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: