తెలుగు బుల్లితెర పైన నటిగా జబర్దస్త్ లేడి కమెడియన్ గా ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి రీతూ చౌదరి. తన అందం అభినయంతో సోషల్ మీడియాలో మరింత ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇంటి గుట్టు అనే సీరియల్ ద్వారా మొదటిసారి ఎంట్రీ ఇచ్చింది.. కరోనా తర్వాత సీరియల్స్ తో కొంతమేరకు తగ్గించిన సోషల్ మీడియా ద్వారా మాత్రం తరచు యాక్టివ్గా ఉంటూ అప్పుడప్పుడు కొన్ని రకాల రిల్స్ తో అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రీతూ చౌదరి తన వివాహం గురించి పలు విషయాలను తెలియజేసింది.



తాజాగా రీతూ చౌదరి తన పెళ్లి గురించి పలు రకాల రూమర్స్ వినిపిస్తున్న తరుణంలో అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టే విధంగా తెలియజేస్తోంది. 2022లో రీతూ చౌదరి శ్రీకాంత్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. అయితే ఆ సమయంలో అతడిని వివాహం చేసుకున్నట్లుగా కూడా మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాని రీతు చౌదరి మాత్రం తన పెళ్లి విషయన్ని ఎప్పుడూ కూడా ఎక్కడ చెప్పలేదు.


అయితే శ్రీకాంత్ తో తనకు పెళ్లి జరగలేదని తనతో కేవలం ఒక ఆరు మాసాలు మాత్రమే కలిసి ఉన్నానని తెలియజేసింది. పెళ్లికి సంబంధించి ఎలాంటి ఫోటోలు కూడా ఎక్కడా లేవని కేవలం అవన్నీ రూమర్సే అంటూ తెలియజేసింది. ప్రస్తుతం తాను ఎవరితో కూడా రిలేషన్ లో లేనని ఇకమీదట పెళ్లి వార్తలు గురించి ఎవరూ కూడా ఇకమీదట మాట్లాడకపోవడమే మంచిది అంటూ తెలియజేసింది.. అలాగే బెట్టింగ్ ప్రమోషన్స్ విషయంలో కూడా తనమీద కేసులు రావడంతో పాటు రూ.700 కోట్ల స్కామ్ లో కూడా తనమీద ఆరోపణలు వినిపించాయి.. అయితే తాను అవన్నీ కూడా పట్టించుకోనని కేవలం తన కెరియర్ మీదే ఫోకస్ పెట్టానని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: