త్వరలోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 షో మొదలు కాబోతోంది. ఈ షో గతంలో విడుదలైన షోల కంటే చాలా భిన్నంగా ఈసారి సన్నహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది బిగ్ బాస్ నిర్వాహకులు. ముఖ్యంగా ఈసారి హౌస్ లో సామాన్యుల నుంచి సెలబ్రెటీలు సోషల్ మీడియా యూజర్స్ హౌస్ లోకి అడుగుపెట్టేలా చూస్తున్నారు. ఈసారి అగ్నిపరీక్ష అనే వాటితో మొదలుపెట్టారు. అలాగే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించే వారిని కూడా ఎంపిక చేసే పనిలో పడ్డట్టుగా తెలుస్తాది బిగ్ బాస్ టీమ్.


ఎప్పటిలాగే సీరియల్ తారలతో పాటు సెలబ్రిటీలను కూడా తీసుకురావడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఒక ట్రెండింగ్ జంట రాబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ గా ఒక సెన్సేషనల్ గా మారిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏపీలో ఎమ్మెల్సీ అయిన శ్రీనివాస్.. మాధురి విషయంలో నిరంతరం వీరి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది. దువ్వాడ కుటుంబంతో విభేదాలు రావడంతో మరింత పేరు పాపులారిటీ అయింది.


అంతేకాకుండా వీరిద్దరూ కలిసి చేసే కొన్ని కొన్ని పనులు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ షోలోకి  అడుగు పెట్టబోతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ జంటకు భారీ గానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. దివ్యల మాధురి  కూడా సోషల్ మీడియాలో తన రీల్స్ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇప్పటికే హౌస్ లోకి జంటగా చాలామంది ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వారి కేటగిరి లోనే ఈ జంట కూడా బిగ్ బాస్ సీజన్ 9 లో ఎంట్రీ ఇచ్చేలా ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన అసలు ఈ జంట ఎలా స్పందిస్తుందో తెలియాలి. బిగ్ బాస్ నిర్వాహకులు లిస్ట్ విడుదల చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: