టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాయ్ తీసుకున్న సరికొత్త నిర్ణయం వలన మొబైల్ నంబర్ పోర్టిబిలిటీ మరింత వేగంగా జరగనుంది. ఇప్పటివరకు మొబైల్ నంబర్ పోర్టిబిలిటీకి వారం రోజుల సమయం పట్టింది. కానీ ఈరోజు నుండి కేవలం మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ట్రాయ్ కొత్త నిబంధనలు ఈరోజు నుండి అమలు కానున్నాయి. 
 
ట్రాయ్ వినియోగదారుడు తమ మొబైల్ నంబర్ ను పోర్ట్ చేసుకోవడానికి అర్హుడో కాదో కూడా డిసైడ్ చేయనుంది. తమ బిల్లులను పూర్తిగా చెల్లించిన తరువాత మాత్రమే పోస్ట్ పెయిడ్ కస్టమర్లు మొబైల్ నంబర్ ను పోర్ట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ట్రాయ్ బ్యాన్ చేసిన నంబర్లకు మాత్రం పోర్టిబిలిటీ సాధ్యం కాదని ఇప్పటికే తేల్చి చెప్పింది. ఎవరైనా మొబైల్ నంబర్ ను వేరే వ్యక్తి పేరు మీదకు మార్చినా కూడా పోర్ట్ చేసుకోవడానికి వీలు కాదు. 
 
న్యాయస్థానం నిషేధించిన మొబైల్ నంబర్స్ కు కూడా మొబైల్ నంబర్ పోర్టిబులిటీ సాధ్యం కాదు. ట్రాయ్ ప్రతి పోర్టిబిలిటీకి 6.46 రూపాయలను ఫీజుగా తీసుకోనుంది. యూజర్ల పోర్టింగ్ ధరఖాస్తును యూపీసీ వ్యాలిడిటీ ముగిసేవరకు తిరస్కరించదు. కార్పొరేట్ సర్కిల్స్ లో పని చేసే వారు మాత్రం అధికారికంగా మొబైల్ నంబర్ పోర్టింగ్ కు లేఖను ఇవ్వాల్సి ఉంటుంది. కార్పొరేట్ సర్కిల్స్ లో పని చేస్తున్న వారికి మాత్రం మూడు నుండి ఐదు రోజుల్లో మొబైల్ నంబర్ పోర్టిబిలిటీ ప్రక్రియ ముగుస్తుందని ట్రాయ్ స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: