ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఫీచర్ ఫోన్ కంటే స్మార్ట్ ఫోన్లకే అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో అనేక రకాల యాప్ లు ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ పోయినపుడు లేదా స్మార్ట్ ఫోన్ ను ఎవరైనా దొంగతనం చేసినపుడు ఫోన్ లోని డేటా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్ పోయినా డేటా దుర్వినియోగం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్లలోని ముఖ్యమైన యాప్స్ కు యాప్ లాక్ లేదా ఇతర యాప్స్ ను ఉపయోగించి లాక్ చేసి ఉంచటం మంచిది. యాప్స్ ను లాక్ చేసి ఉంచితే ఇతరులు ఆ ఫోన్లను ఉపయోగించాలన్నా సాధ్యం కాదు. యాప్ లాక్ లేదా ఇతర అప్లికేషన్లను ఉపయోగించి డేటాను హైడ్ కూడా చేయవచ్చు. స్మార్ట్ ఫోన్లు చోరీకి గురైనపుడు ఎక్కువశాతం వాట్సాప్ యాప్ మిస్ యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వాట్సాప్ లాంటి ముఖ్యమైన యాప్స్ కు లాక్ లేకపోతే వాట్సాప్ డేటా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోయిన స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ కు లాక్ లేకపోతే వీలైనంత త్వరగా సిమ్ కార్డ్ బ్లాక్ చేయించి అదే నంబర్ తో కొత్త సిమ్ తీసుకొని వాట్సాప్ యాక్టివేట్ చేసుకోవాలి. ఫోన్ పోయిన వెంటనే వీలైనంత త్వరగా సిమ్ కార్డును బ్లాక్ చేయించాలి. ఫోన్ పోగొట్టుకున్న సమయంలో చాలామంది ఫిర్యాదు చేయటానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న ఫోన్ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్ లాంటి డేటాను ఎప్పుడూ ఫోన్లలో దాచుకోకపోవటమే మంచిది. స్మార్ట్ ఫోన్లలో ఉండే మొబైల్ ట్రాకింగ్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకుంటే ఫోన్ యాక్టివ్ గా ఉన్నంతవరకు ట్రాక్ చేయవచ్చు. ఫోన్ పోయినా రిమోట్ యాక్సెస్ ద్వారా డేటాను ఎరేజ్ చేయవచ్చు. ఫోన్ పోయిన వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ హెల్ప్ లైన్ నంబర్ 14422 కు కాల్ చేస్తే ఫోన్ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి