యాపిల్ ఎలెక్ట్రానిక్ వస్తువుల పై ఆ కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ల తో వస్తువులను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. మాముగానే ఈ కంపెనీ వస్తువుల పై యువత ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. యాపిల్ బ్రాండ్ ఫోన్లు కొనాలని యువత అభిప్రాయ పడుతున్నారు. అయితే వీటికి ఉన్న ధరల కారణంగా వెనకడుగు వేస్తున్నారు. ధర ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఈ వస్తువులకు డిమాండ్ ఎక్కువే.  ఈ ఫోన్లు ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. ఇకపోతే ఇటీవల పండగ సీజన్ లలో కంపెనీ నుంచి తయారైన ప్రతి వస్తువు పై అత్యుత్తమ ఆఫర్ ను అందించారు.



ఇటీవల కాలంలో యాపిల్ ఫోన్ల పై ఆన్ లైన్ మార్కెట్ కంపెనీలు భారీ ఆఫర్ ను అందించారు. యాపిల్ కంపెనీకు సంబంధించిన పలు ఫోన్ల పై భారీ తగ్గింపును ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా కస్టమర్లకు షాక్ ఇచ్చే రేంజులో  క్యాష్ బ్యాక్ ఆఫర్ల ను అందించనున్నారు. ఈ మేరకు యాపిల్‌ ఉత్పత్తులు కొనుగోలు చేసేవారికి సంస్థ భారీగా రాయితీని ప్రకటించింది. యాపిల్‌ స్టోర్‌ నుంచి ఆన్‌ లైన్‌ ద్వారా రూ. 44,900కి పైగా కొనుగోలు చేసేవారికి రూ.5 వేల వరకు క్యాష్ ‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది.



ఈ నెల 21 నుంచి 28 వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు ఈఎంఐ ఎంపిక చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తించనున్నది. దీంతో పాటు ఆరు నెలల నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని కల్పించింది. బుకింగ్‌ చేసుకున్న వస్తువులు డెలివరీ అయిన తర్వాత మాత్రమే క్యాష్ ‌బ్యాక్‌ లభించనున్నదని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ వినియోగ దారులకు సంతోషాన్ని కలిగిస్తోంది.. దీంతో ఇప్పుడు యాపిల్ బ్రాండ్ పై కొనుగోలు పెరిగినట్లు తెలుస్తుంది. యాపిల్ ఫోన్లు లేదా వస్తువులకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్.

మరింత సమాచారం తెలుసుకోండి: