టాప్ మొబైల్ కంపెనీలలో ఒకటి రియల్ మీ.. ఈ కంపెనీ నుంచి ఎన్నో ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. ఇప్పటి వరకు విడుదల అయిన అన్నీ ఫోన్లు మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి. అయితే ఇప్పుడు మరో ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఆ ఫోన్ ధర కూడా చాలా తక్కువ అని అంటున్నారు. మరి ఆ ఫోన్ ఫీచర్లు, ధర మొదలగు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..



ఎంట్రీ లెవల్ స్పెసిఫికేషన్ల తో ఈ ఫోన్ లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఇందులో 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను అందించారు. వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు.ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 24,90,000 డాంగ్‌లుగా  నిర్ణయించారు.



హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.. అంతేకాదు ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇటీవల వచ్చిన ఫోన్ల మాదిరిగానే వెనుక వైపు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. మైక్రో యూఎస్‌బీ పోర్టును ఇందులో అందించారు. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉంది.. ఈ ఫోన్ ధర కూడా తక్కువగా ఉండటం కారణంగా కొనుగోళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: