పేరెంటింగ్ : మ‌రీ!ఇంత స్మార్ట్ ప‌నికి రాద‌య్యో!

బాల్యం నుంచి మీరు
మీ నుంచి బాల్యం కోరుకుంటున్న‌వి
ఓ సారి జాబితా రూపంలో రాయండి

ఆట‌లూ పాట‌లూ ప‌తంగులూ
ఇవేవీ లేకుండా బాల్యం కేవ‌లం
కొన్ని రంగుల తెర‌ల‌కే క‌ట్టుబ‌డి ఉంటుందా?

మీ పిల్ల‌లు స్మార్ట్ అని అంటే నవ్వుకోండి
ఎందుకంటే అదేమంత ఎదుగుద‌ల కాదు
అది కూడా ఓ విధం అయిన ప‌త‌న‌మే

ఓ కుర్రాడు..బ‌డికి పోయే అవ‌కాశం లేదు. కానీ చ‌దువు అంతా డిజిట‌ల్ క్లాసుల రూపంలోనే వింటున్నాడు. ఆ త‌రువాత ఏమ‌యిందో కానీ ప‌బ్ జీలు ఆడ‌డం మొద‌లుపెట్టాడు. ఇంకొన్నింటికి అడిక్ట్ అయ్యాడు. త‌ల్లీ తండ్రీ ప‌ట్టించుకోలేదు. ఫ‌లితం ఆ కుర్రాడి కార‌ణంగా ఆ త‌ల్లి అకౌంట్ నుంచి ల‌క్ష రూపాయ‌లు మాయం అయ్యాయి.. కేవ‌లం స్మార్ట్ ఫోన్ వాడ‌డంతోనే జ‌రిగిన దుష్ఫ‌లితం. ఆరా తీస్తే ఆ కుర్రాడు కొన్ని యాప్స్ ను అప్ డేట్ చేసేం దుకు, ప‌బ్ జీ ఆడేందుకు ఆ మొత్తం వెచ్చించాడ‌ని తెలిసి ఆ త‌ల్లి నిర్ఘాంత‌పోయింది. త‌న‌కు తెలియ‌కుండానే మాయం అయిపోయిన డ‌బ్బు, త‌న‌కు తెలియ‌కుండానే ఆన్ లైన్  ఆట‌ల‌కు బానిస అయిన కొడుకు..ఇవ‌న్నీ తె లియ‌కుండానే  జ‌రిగిపోయి ఆ కుటుంబాన్ని  ఇర‌కాటంలో ప‌డేశాయి. ఇప్పుడు ఆన్ లైన్ ఆట‌లు బందు చేయ‌డం కుద‌ర‌ని ప‌ని..ఇలా ఎంద‌రో ! మీ బిడ్డ‌ల‌కు ఫోన్లు ఇవ్వ‌కండి..అని  చెప్ప‌గ‌ల‌మా లేదు క‌దా! క‌నీసం ప‌ర్య‌ వే క్ష‌ణ అయినా చేయండి. ఈ పాటి ఖాళీ లేన‌ప్పుడు ఈ పాటి బాధ్య‌త లేన‌ప్పుడు మీరు పేరెంట్ అని చెప్పుకోవ‌డం కూడా సిగ్గు చేటే. మీ పిల్ల‌ల మాన‌సిక క్షోభ‌కు మీరు కార‌ణం అవ్వ‌కండి..ఏం అయినా కూడా మేం ప‌ట్టించు కోం అంటే ఏం చెప్ప‌లేం. మా వాడు ఫోన్ లేకుండా ఉండ‌లేడండి అన్న సోది మాట‌లు ఏవీ చెప్ప‌కండి. ఆన్లైన్ క్లాసుల‌కు వాళ్లు ఎలా అటెండ్ అవుతున్నారు. ఆ త‌రువాత వాళ్లు చూస్తున్న‌వేంటి.. డేటా యూసేజ్ ఎలా ఉం ది..ఇవ‌న్నీ ప‌ర్య‌వేక్షించాల్సింది మీరే!  ఫోన్ ఇచ్చేశాం ఇక మా ప‌ని అయిపోయింది అంటే కుద‌ర‌దు. ఇప్పుడు రోగాలు మొబైళ్ల వ‌ల‌నా వ‌స్తున్నాయి.. కంప్యూట‌ర్ కార‌ణంగానూ వ‌స్తున్నాయి. మీరు ఈ ర‌కం ఆన్లైన్ రో గాల‌ను నియంత్రించాలంటే ముందు జాగ్ర‌త్తే ఈ మాయ రోగానికి విరుగుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: