సాంకేతిక విప్లవం అనంతరం ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. ఏదైనా ఈ అరచేతిలో నుండే చూడవచ్చు, చేయవచ్చు. అదే మొబైల్. ఇటీవల అత్యంత చౌకగా స్మార్ట్ ఫోన్ లు కూడా అందరికి అందుబాటులోకి వచ్చేశాయి. దీనితో అనేక సేవలు కేవలం ఈ మొబైల్ నుండే పొందే అవకాశాలు అనేక సంస్థలు ఇప్పటికే కల్పిస్తున్నాయి. గతంలో మొబైల్ అంటే కేవలం ఎవరితోనే మాట్లాడటానికి మాత్రమే సౌలభ్యం ఉండేది. ఇప్పుడు కేవలం మాట్లాడటం కాదు, అసలు దానితో చేయలేని పని లేదంటే అతిశయోక్తి కాదు. కొత్తగా ఏ సాంకేతికత వచ్చినా దానిని ఈ మొబైల్ లో పొందుపరచుకొని అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు.

సాధారణ కాల్ నుండి ఏదైనా ఎక్కడ నుండైనా కొనుక్కొనే పని వరకు అరచేతిలో ఉన్న మొబైల్ తో చేసేయవచ్చు. ఈ స్థితి కేవలం సాంకేతిక విప్లవం వలన మాత్రమే సాధ్యం అయ్యింది. అయితే ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టే ఒక విషయాన్ని మంచికి వాడవచ్చు అలాగే చెడు కోసమూ వాడవచ్చు. అది ఆయా వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. మంచి కోసం వాడినప్పుడు ఫలితాలు ఆత్మతృప్తిని ఇస్తాయి, మరో విధంగా వాడినప్పుడు విమర్శలు ఎదురవుతాయి. ఇక ఏదైనా కొనాలి అనుకుంటే ఒకప్పుడు బ్యాంకు వాళ్ళు వెంటపడి మరి అంటకట్టే క్రెడిట్ కార్డు గురించి అందరికి తెలిసిందే. సాంకేతికత కారణంగా ఈ పద్దతిలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

క్రెడిట్ కార్డులను కూడా జాగర్తగా వాడుకునే వాళ్ళు ఉంటారు, ఇష్టానుసారంగా వాడేసి ఇబ్బందులు కొనితెచ్చుకునే వారు ఉంటారు. ఇక ఇందులో వచ్చిన సాంకేతిక విప్లవం తో ఇది కూడా మొబైల్ లలోకి వచ్చేసింది. కేవలం మీ బ్యాంకుకు క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటేనే చాలు వెంటనే మొబైల్ లో దర్శనం ఇచ్చేట్టుగా సిద్ధం చేశారు. ఇలా మొబైల్ లోకి వచ్చేసిన క్రెడిట్ కార్డును వెంటనే వాడుకొనే అవకాశం ఉంది. ఇక మాములుగా పాత పద్దతిలో ప్లాస్టిక్ కార్డు కూడా మీ దరఖాస్తులో నమోదు చేసిన చిరునామాకు పోస్ట్ ద్వారా పంపిస్తారు. రెండు విధాలుగా వాడుకునే అవకాశం కల్పిస్తున్నాయి బ్యాంకులు. అయితే ఈ సేవలు ప్రస్తుతం ఫెడరల్ బ్యాంకు వంటి కొన్ని మాత్రమే అందుబాటులోకి తెచ్చాయి. త్వరలో ఈ సాంకేతికత కూడా అందరికి అందుబాటులోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: