ప్రపంచంలో సాంకేతిక విప్లవంతో అనేక సామజిక మాధ్యమాలు  వచ్చేశాయి. వాటిద్వారా ఎక్కడెక్కడ ఉన్న వారితో స్నేహ సంబంధబాంధవ్యాలు పరిధులను దాటి ఏర్పడుతున్నాయి. ఈ సాంకేతికత ప్రపంచాన్ని చిన్న గ్రామం చేసిందని నిపుణులు అన్న మాట. అదేవిధంగా ఎక్కడ ఉన్నవారైనా మరెక్కడా ఉన్న వారితో అయినా సంభాషించే అవకాశం ఈ సాంకేతికత తెచ్చిపెట్టింది. దీనితో అందరు అందుబాటులో ఉన్న అనేక సామజిక మాధ్యమాల ద్వారా ఎక్కడెక్కడి వారితోనో బంధుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫేస్ బుక్ ఇందులో ముందుందని చెప్పాలి. మిగిలిన ట్విట్టర్, వాట్స్ యాప్ లాంటి అనేక మాద్యమాలద్వారా ప్రపంచం మాట్లాడుకుంటుంది. అనేక విషయాలపై చర్చలు కూడా జరుగుతున్నాయి.

కత్తికి రెండువైపులా పదును ఉన్నట్టుగా ఈ సాంకేతికత కు కూడా రెండు వైపులు ఉన్నాయి. అంటే వీటితో ఎంత మేలు జరుగుతుందో అంత నష్టం కూడా జరుగుతుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పినప్పటికీ ఆదో సామజిక వ్యసనం ఎలా అయిందో, ఈ సామజిక మాధ్యమాలు కూడా అంతే ప్రభావం చూపుతున్నాయి. ఫేస్ బుక్ లో అయితే రోజుకొక ఘటన వెలుగులోకి వస్తున్నాయి. అందులో ప్రేమ వ్యవహారాలలో మోసపోయిన వారు, ఆత్మహత్యలు లైవ్ టెలికాస్ట్ చేస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతుంది. దీనితో ఈ ప్రభావం ఇతరుల పై కూడా పడుతుంది.

తాజాగా మరో లైవ్ ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది. ఒక భర్త తన భార్య ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటూ అది ఫేస్ బుక్ లైవ్ ప్రసారం చేశాడు. దానిని చుసిన అతడి మిత్రులు అధికారులకు పిర్యాదు చేశారు. అయితే సదరు భార్య గతంలోనే భర్త తనపై గృహ హింసకు పాల్పడుతున్నట్టు  పోలీస్ స్టేషన్ లో పిర్యాదు నమోదు చేసింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మేనేజర్ గా పనిచేస్తున్న అతడు ఆరేళ్ళ క్రితం ఆమెను పెళ్లి చేసుకున్నాడు.  కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. పిర్యాదు నమోదు చేసుకున్న అధికారులు నిజనిజాలు తేల్చేందుకు విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: