రెడ్‌మి ఫోన్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ఇండియాలో రెడ్‌మి కంపెనీ రెడ్‌మి నోట్ 10 సిరీస్‌ ఫోన్లను ఆపేసింది. దాని స్థానంలో రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ అందుబాటులోకి వచ్చింది. వెనుక ప్యానెల్‌ క్వాడ్ కెమెరా సెటప్‌ ఈ టాప్-ఎండ్ వేరియంట్ లో ఉంది. ఫస్ట్ కెమెరా 108 మెగా పిక్సెల్స్. అలాగే ఈ ఫోన్‌లో 5020 mAh బ్యాటరీ వచ్చింది. అమెజాన్‌లో జరుగుతున్న సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చౌకగా కొనేయొచ్చు. ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో కొనసాగుతున్న సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లో లిస్ట్ చేశారు. వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన సమాచారం ప్రకారం దీని బెస్ట్ ఆఫర్ రూ .17749. ఈ ఫోన్‌ ను 6 నెలల స్క్రీన్ రీప్లేస్‌మెంట్ వారంటీ, 9 నెలల నో కాస్ట్ EMI ఆప్షన్ తో మీ సొంతం చేసుకోవచ్చు.

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్‌లు
రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ సూపర్ AMOLEDతో  6.67 అంగుళాల డిస్‌ప్లే తో వస్తుంది. దీని రిఫ్రెష్ రేటు 120Hz. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వచ్చింది. Qualcomm Snapdragon 732G ప్రాసెసర్ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ లో ఉంది. అలాగే ఇది 6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది.  ఈ రెడ్ మీ ఫోన్‌లో 5020 mAh బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో మంచి సౌండ్ క్వాలిటీ తో లభ్యం అవుతోంది.  

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ కెమెరా సెటప్
ఈ రెడ్‌మి ఫోన్ వెనుక ప్యానెల్‌లో క్వాడ్ కెమెరా సెటప్‌ ఉండగా, ఇందులో ఫస్ట్ కెమెరా 108 మెగాపిక్సెల్స్. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్స్, ఇది అల్ట్రా-విండ్ యాంగిల్ లెన్స్ తో లభిస్తుంది. మూడవ కెమెరా 5 మెగాపిక్సెల్ టెలి-మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ తో నాల్గవ కెమెరా డెప్త్ సెన్సార్ ఆప్షన్ తో వస్తుంది. ఇందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ను అమెజాన్ నుండి సులభమైన వాయిదాలలో కొనొచ్చు. ఈ ఆప్షన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఇచ్చారు. ఇది sbi తో సహా అనేక బ్యాంకుల ఆఫర్లను కల్పిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: