భారత రక్షణ వ్యవస్థ డి.ఆర్.డి.ఓ. మరో మెయిలు రాయిని దాటింది. గత మూడు దశాబ్దాలుగా ఒక ఆయుధ తయారీకి కృషి చేస్తుంటే, అది తాజాగా విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం భారత అమ్ముల పొదిలో మరో ఆణిముత్యాన్ని చేర్చింది. దీనికోసం ఇంతకాలంగా కృషి చేసినప్పటికీ, ఫలితం అందరి కష్టాన్ని ఇట్టే మరిపించేసింది అని చెప్పాలి. ఇలా డి.ఆర్.డి.ఓ. పరిశోధనలు వరుసగా విజయాలు సాధిస్తూ పోతుంది. రక్షణ పరంగా అనేక అద్భుతమైన ఆయుధాలు కనిపెట్టడంలో సృష్టించడంలో విజయం సాధిస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్తవి రక్షణ వ్యవస్థలో చర్చడంలో తన వంతు కృషి చేస్తున్నప్పటికీ, ఇది అతిగొప్ప విజయంగా చెప్పుకోవాల్సిందే. ఇలా ప్రతి సారి రక్షణ వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరుస్తూనే ఉంది డి.ఆర్.డి.ఓ. మారుతున్న పరిస్థితులను, సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ, స్వదేశీ పరిజ్ఞానంతో దానిని మేళవించి సరికొత్త ఆయుధాగారాన్ని దేశం కోసం సిద్ధం చేస్తూనే ఉండటంతో నిరంతరం ముందడుగు వేస్తూనే ఉంది.

ఈ విజయంలో సమయం కంటే ఆయుధం ఎంత ఉపయుక్తం అనేది కూడా ముఖ్యంగా గమనించాలి. ఈ మూడు దశాబ్దాలుగా డి.ఆర్.డి.ఓ. వర్టికల్ గా మిసైల్ ను లాంచ్ చేయడం కోసం కృషి చేసింది, ఫలితం నేడు సాధించి చూపెట్టింది. ఇన్నేళ్ల కఠోర శ్రమ అనంతరం ఈ ఫలితం సాదించింది డి.ఆర్.డి.ఓ. ఈ ప్రయోగం వంద శాతం విజయవంతం చేసింది. ఈ ప్రయోగం ఒడిశా లోని ఛండిపూర్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి దీనిని పరీక్షించింది డి.ఆర్.డి.ఓ. దీని మొదటి పరీక్ష ఈ ఏడాది ఫిబ్రవరి లో జరిగింది.

ఈ వ్యవస్థ నౌకాదళ రక్షణ కోసం ఉత్తమంగా ఉపయోగపడుతుంది అని రక్షణ మంత్రి చెప్పారు. పరీక్ష విజయవంతం కావడంతో డి.ఆర్.డి.ఓ. ఆయన అభినందించారు. ఈ పరీక్ష విజయవంతం కావడం ద్వారా భారత నౌకాదళ ఆయుధ వ్యవస్థకు మరింత రక్షణ కల్పించబడినట్టే. శత్రువులు నౌకలపై ఆయుధాలు ప్రయోగించినప్పుడు, వీటి ద్వారా శత్రులను ప్రతిఘటించడం సులభతరం అవుతుంది. అందుకు ఈ వ్యవస్థ చక్కగా ఉపయోగపడుతుంది. నేవీ లో మరో ఉత్తమ ఆయుధం చేరిపోయినట్టే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: