ప్రముఖ స్మార్ట్ మొబైల్ దిగ్గజం సంస్థలలో వన్ ప్లస్ కూడా ఒకటి. తాజాగా నార్డ్ -2T మొబైల్ విడుదల చేస్తోంది. దీనిని వచ్చే నెల 1వ తారీఖున అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఇక ఈ మొబైల్ యూరప్లో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎప్పుడు రానుంది అనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే భారత్లో లాంచింగ్ కు సంబంధించి padsionate GeekZ అనే వెబ్సైట్ ద్వారా తెలియజేయడం జరిగింది. కొత్త మిడిల్ రేంజ్ మొబైల్ జూలై 1న భారతదేశంలో లాంచ్ అవుతోందని.. అధినేత అభిషేక్ యాదవ్ ట్విట్టర్ లో తెలియజేశారు.

అయితే గతంలో జూన్ చివరి నాటికి ఈ మొబైల్ విడుదల అవుతోందని వార్తలు వచ్చాయి.. ఇప్పుడు వన్ ప్లస్ నార్డ్ -2T మొబైల్ జూలై 5న మార్కెట్లోకి విడుదల అవుతోంది. ఈ మొబైల్ ధరను కూడా వెల్లడించారు ఈ మొబైల్ ప్రారంభం ధర రూ.28,999 తో లభిస్తుంది.ఇందులో 8 Gb ram+128 GB వేరియంట్ స్టోరేజ్ కలదు. ఇక ఇందులోనే 12 GB RAM+256 GB మెమొరీ సామర్థ్యం కల మోడల్స్ కూడా ఉన్నది. మార్కెట్ లో దీని ధర రూ.33,999 కలదు. ఇది 5g ఉండే అవకాశం కలదు.

ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. One plus Nord -2T మొబైల్ మీడియా డైమెన్సిటీ 1300 SOC కలదు.12 GB RAM,256GB మెమోరీ స్టోరేజ్ కలదు. ఇక చార్జింగ్ పరంగా 80 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ సాంకేతికను ONEPLUS -10 R మొబైల్ తో పోల్చవచ్చు . నార్డ్ పాత మోడల్ 65W చార్జింగ్ రాబోతోంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH ఉండబోతోంది. వివో వై ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ తో కలదు. కెమెరా 50 ప్రైమరీ కెమెరా , సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను ఉన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: