ప్రస్తుతం టెక్నాలజీ మారుతున్న కొద్ది కార్లలో కూడా పలు మార్పులు రావడం జరుగుతు వస్తోంది. ప్రముఖ బ్రాండెడ్ కలిగిన మారుతి సుజుకి ఆల్టో కార్ ఫ్యాన్స్ కు త్వరలోనే ఒక శుభవార్త అందిస్తోంది. ఇక ఈ బ్రాండెడ్ నుంచి సరికొత్త ఆల్టో కార్ రాబోతున్నట్లుగా తెలియజేసింది అది కూడా కేవలం నాలుగు లక్షల రూపాయల బడ్జెట్ లోపు ఉండే విధంగా ఈ కారుని తయారు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నది.


రాబోయే కొత్త ఆల్టో కార్ హార్టెక్ట్ ప్లాట్ఫామ్ ఆధారంగా ఇది ఉండబోతుందని అంచనా వేయడం జరిగింది ఇంజన్ విషయంలో కూడా అతిపెద్ద అప్డేట్ ఉండవచ్చు అని సమాచారం. మారుతి సుజుకి ఈ ఏడాది  ఆల్టో కార్లలో 796సీసీ మోటార్ తో పాటు 1.0 లీటర్ K10 సీసీ DUAL -JET ఉంటుందని అంచనాని వేశారు. ఇక అంతేకాకుండా పవర్ ఔట్పుట్ విషయానికి వస్తే 48 BPH , టార్క్ పవర్ ఔట్పుట్ విషయానికి వస్తే 69NM చేస్తుందని తెలియజేశారు. ఇక అంతే కాకుండా ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్లతో అందుబాటులో ఉండబోతుందట.


మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే మారుతి సుజుకి ఆల్టో సీజన్ ను  కూడా త్వరలో తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఇందులో డాష్ బోర్డు, కొత్త సీట్లు, చాలా స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలియజేశారు ఇప్పటికీ ఉన్న ఆల్టో కార్లలో పోలిస్తే ఈ ఏడాది వచ్చే ఆల్టో ఫీచర్ అదినాతేనమైనవిగా ఉండబోతున్నట్లు తెలియజేశారు. ఇక అంతే కాకుండా ఇందులో ఏడు అంగుళాల స్మార్ట్ డిస్ప్లే తో పాటు టచ్ స్క్రీన్ సిస్టం కూడా కలదు. ఇక ధర విషయానికి వస్తే ఎక్స్ షోరూం ధర రూ.4.10 లక్షల నుండి రూ.4.70 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేయడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: