
ఇప్పుడు తాజాగా నోకియా నుండి మరొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చిందట. ఈ స్మార్ట్ ఫోన్ ఆకర్షణమైనా డిజైన్ సింగిల్ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుందట. అయితే ఈ మొబైల్ యూరప్ మార్కెట్లో లాంచ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ స్మార్ట్ మొబైల్ ఎంట్రీ ఫీచర్లు కూడా అదే విధంగా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ స్మార్ట్ మొబైల్ ఎటువంటి ప్రత్యేకతలను కలిగి వుందో ఒకసారి తెలుసుకుందాం.
NOKIA C-12 SPECKS:
నోకియా C-12వ స్మార్ట్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.3 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో కలదు. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నొచ్ తో లభిస్తుందట. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో సెల్ఫీ రియల్ కోసం 5 మెగా ఫిక్స్ఎల్ కెమెరా కలదు. ఆక్టోకార్ ప్రాసెస్ తో ఈ మొబైల్ పనిచేస్తుంది. 2 జిబి ర్యామ్ 64 జిబి స్టోరేజ్ కలదు. నోకియా C-12 మొబైల్ ఆండ్రాయిడ్ 12 ,OS పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ బ్యాక్ కెమెరా విషయానికి వస్తే 8 మెగా పిక్సెల్ కలదు. బ్యాటరీ విషయానికి వస్తే ..3000 MAH సామర్థ్యం తో పాటు రియూవబుల్ బ్యాటరీ తో వస్తుంది. ఈ మొబైల్ 4G మొబైల్. అలాగే బ్లూటూత్ వైఫై తదితర ఫీచర్లు కలవు.