
ఫ్యూయల్ ఖర్చు అనేది మనం వెళ్ళే స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. యావరేజ్ స్పీడ్ లో వెళితే ఫ్యూయల్ చాలా తక్కువగా ఖర్చు అవుతుంది హై స్పీడ్ లో వెళితే ఆ స్పీడ్ పెరిగే కొద్దీ ఫ్యూయల్ కూడా ఎక్కువగా ఖర్చు అవుతుందట. ఈ టెక్నిక్ తెలుసుకొని నడిపితే మైలేజ్ కచ్చితంగా పెరుగుతుందని చెప్పవచ్చు.
ఇక మరొకటి టైర్లలో గాలి సరిపడేంత ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి.. కావలసిన దానికంటే తక్కువగా గాలి ఉన్న కారు రన్నింగ్ లో ఉన్నప్పుడు మైలేజ్ భారీగా తగ్గిపోయి అవకాశం ఉంటుందట.
అలాగే మనం డ్రైవ్ చేసేటప్పుడు గేర్లు సరిగ్గా వేస్తున్నామా కారు రన్నింగ్ లో ఉన్నప్పుడు స్పీడ్ కు తగ్గట్టుగా గేర్లు మారుస్తూ ఉండాలి. వాహనం తక్కువ స్పీడు ఉన్నప్పుడు ఎక్కువ గేర్లు వేస్తే ఇంజన్ ఆ స్పీడ్ ను తట్టుకోలేక ఎక్కువగా ఫ్యూయల్‌ను ఖర్చు చేసుకుంటుందట. ముఖ్యంగా కారు ఎయిర్ ఫిల్టర్ క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. ఇది క్లీన్ గా లేకపోతే ఎయిర్ ఫ్లోక్ ఇబ్బంది అవుతుంది.
ఇంజన్ ఆయిల్ వాహనం కొనుగోలు చేసేటప్పుడు అందుకు సంబంధించిన ఇంజన్ ని ఏ గ్రేడ్ ఆయిల్ ని వాడాలి.
కారు నడిపేటప్పుడు కచ్చితంగా క్లచ్ ని ఎలా వాడుతున్నాం అనేది ముఖ్యము కొంతమంది క్లచ్ ఫెడల్ పై పాదాన్ని పెట్టి అలా నడుపుతూ ఉంటారు అలా ఎప్పుడూ నడపకూడదు. సడన్ గా బ్రేక్ వేసి ఎక్స్ లెటర్ వంటివి అసలు తొక్కకూడదు ఇవే మైలేజ్ పైన చాలా ప్రభావాన్ని చూపిస్తాయట. ఇలాంటివన్నీ సరిచూసుకొని వెహికల్ మైంటైన్ చేస్తే మైలేజ్ పెరుగుతుంది.