జియో యూజర్లకు అదిరిపోయే తీపికబురు!  రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ గూగుల్‌తో జతకట్టి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జియో వినియోగదారులకు జెమిని ప్రో ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్ విలువ ఏకంగా 35,100 రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఉచిత ప్లాన్ ఈరోజు నుంచే అందుబాటులోకి రానుంది.

మొదటి దశలో, 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మరియు అన్లిమిటెడ్ 5g ప్లాన్ కలిగిన జియో యూజర్లు ఈ ఆఫర్‌ను పొందడానికి అర్హులు. త్వరలోనే, మిగతా వినియోగదారులకు కూడా ఈ ప్లాన్ దశల వారీగా అందుబాటులోకి రానుంది.

జెమిని ప్రో ప్లాన్‌లో భాగంగా, వినియోగదారులకు జెమిని 2.5 ప్రో మోడల్ సేవలు లభిస్తాయి. దీంతో పాటు, 2 GB క్లౌడ్ స్టోరేజ్, వియో 3.1 వీడియో జనరేటర్, నానో బనానా వీడియో జనరేషన్ వంటి వినూత్న ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అదనంగా, నోట్ బుక్ LM, జెమిని కోడ్ అసిస్ట్, జీ మెయిల్, డాక్స్ వంటి గూగుల్ ఉత్పత్తులలో కూడా జెమిని సేవలను వినియోగించుకోవచ్చు.

ఈ ఉచిత ప్లాన్‌ను పొందాలంటే, అర్హులైన యూజర్లు మై జియో యాప్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే క్లెయిమ్ నవ్ (Claim Now) అనే బ్యానర్‌ను క్లిక్ చేసి, ఈ ప్లాన్‌ను సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రో సబ్‌స్క్రైబర్లుగా ఉన్నవారు తమ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత గూగుల్ ఏఐ ప్రో సేవలకు మారే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను ఉచితంగా అందించేందుకు జియో తీసుకున్న ఈ చొరవ వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: