ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసే అంశం ఇది.  ఈ ఏడాది చివరి సూర్యాస్తమయాన్ని చూడలేక పోయారా ? అయితే ఈ వార్త మీ కోసమే. సూర్యుడు రేపటి రోజున  నూతన ఏడాది ఆగమనాన్ని ఆహ్వానించేందుకు...కొత్త కాంతులు వెదజల్లేందుకు  ముస్తాబై  రావడం కోసం రాత్రి ని  ఆహ్వానించేశాడు..ఆ సంధికాలపు సంధ్యాసమయం ఎలా ఉంటుందో తెలుసా ?

తూరుపున ఉదయించిన సూర్యుడు పడమట కంటికి నుంచి కనుమరుగయ్యే కాలాన్ని సూర్యాస్తమయం అంటారు. దీనినే ఆంగ్ల భాషా ప్రేమికులు సన్ డౌన్ అని వ్యవహరిస్తారు. భారత్ లో చాలా మంది సూర్యోదయం, సూర్యాస్తమయం వీక్షించడానికి, తమ సెల్ ఫోన్ లలోను,కెమెరాలలోనూ నిక్షిప్తం చేసుకోవడానికి కన్యాకుమారి వెళుతుంటారు. అక్కడ మూడు సముద్రాలు సంగమించే చోట స్నానం చేయడం ఒక అనుభూతి. సంధ్యాసమయం కూడా గమ్మత్తుగా ఉంటుంది.  సూర్యోదయపు కాలం, సూర్యాస్తమయపు కాలం రెండూ కూడా సంధ్యాసమయం అని వ్యవహరించడం కద్దు. సంధ్యా సమయపు అందాల గురించి తెలుగు సాహిత్యంలో ఎన్నో కథలు, కవితలు, సినిమా పాటలు లెక్క లేన్ని వచ్చాయి. ఒక ప్రాచీన కవి సంధ్యాసమయం పై ఏకంగా ఒ నవలే రాశాలంటే ఆ కొద్ది సేపటి మహత్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు. తోలి సంధ్య వేళలో... తొలిపొద్దు పొడుపులో అంటూ సినీ కవులు చాలా మంది సూర్యుడి గమనా గమనాలను తమ సాహితీ పంక్తుల్లో వివరించారు. మనకు వీనుల విందు కల్గించారు. గోదావరి తీరంలోనో, ఇసుక తిన్నెల మీదనో నడుకుంటూ వెళితే ఎలా ఉంటుంది?  సముద్రపు ఒడ్డున నిల్చుకుని ఉన్నప్పుడు అలలు సున్నితంగా మన పాదాలను తాకుతూ ఉంటే ఎలా ఉంటుంది ? ఒక్క సారి ఊహించుకోండి. అలాంటి  అనుభూతే మీ కోసం...

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయాన్ని, అక్కడి విశిష్టతను వర్ణించడానికి మాటలు చాలవు. అంత ప్రాముఖ్యత గల్గిన ప్రదేశం అది. ఈఏడాది అంటే 2021 వ సంవత్సరపు చివరి సూర్యాస్తమయాన్నిప్రముఖ వార్తా సంస్థకు చెందిన ఫోటోగ్రాఫర్ లు తమ కెమెరాలలో బంధించారు.  మీరూ వీక్షించండి..



మరింత సమాచారం తెలుసుకోండి: