దావూద్ ఇబ్రహీం గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇతను భారత్ ఎంతో కాలంగా తీక్షణంగా వెతుకుతున్న అండర్ వరల్డ్ డాన్ మరియు కరుడుగట్టిన నేరస్థుడు. ఇతనికి భారత్ లో జరిగిన చాలా నేరాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి. భారత్ ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోనూ ఇతని పాత్ర ఉంది.   భారత్ఇ లోనే కాకుండా ఇతర ప్రముఖ దేశాలలో కూడా ఇతని నేర సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇటీవల ఇబ్రహీం పాకిస్థాన్ రాజధాని కరాచీలో నివాసం ఉన్నాడని వారు చెప్పడం జరిగింది. ఇప్పటికీ భారత ప్రభుత్వం ఇక్కడికి తీసుకొస్తామని చెబుతూనే ఉన్నాయి.




అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం రన్ వీర్ మరియు దీపికా లు కలిసి దావూద్ ఇబ్రహీం తో కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనితో ఈ విషయం బాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశం అయింది. పైగా ఈ ఫొటోలో రన్ వీర్, దీపికా లతో పాటుగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, సందీప్ ఉన్నారు. ఈ ఫొటోలో సందీప్ పక్కన కూర్చుని ఉన్న వ్యక్తే దావూద్ అని "జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్" అనే పేరుతో క్రియేట్ అయిన ఓ గ్రూప్ పోస్ట్ చేసింది. 2013 లో రన్ వీర్ సింగ్ మరియు దీపీకా లు నటించిన "గోలియోంకి రాస్‌లీలా రామ్‌లీలా" సినిమా షూటింగ్ సమయంలో విందు చేస్తున్నప్పుడు తీసిన ఫోటో, ఈ ఫొటోలో దావూద్ ఉన్నాడనే సరికి అంత ఆశ్చర్యపోయారు.



ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ ఫోటోని సందీప్ సింగ్ ఈ ఏడాది మే నెలలో తన ఇంస్టా గ్రాంలో పోస్ట్ చేసాడు. ఫొటోలో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా రాసాడు. ఈ ఫొటోలో రన్ వీర్ సింగ్, దీపికా, సంజయ్ లీలా భన్సాలీ, సందీప్ సింగ్, ఆర్ వర్మన్ మరియు వాసిక్ ఖాన్. అయితే అందులో ఉన్న ఆర్ట్ డైరెక్టర్ వాసిక్ ఖాన్ ని చూసి అందరూ అతనినే దావూద్ ఇబ్రహీం అనుకుంటూ ప్రచారం చేస్తుంటే రన్ వీర్ సింగ్ దీపికా పదుకునే దంపతులు దీనిపై మండిపడుతున్నారు. అందుకే సామజిక మాధ్యమాల్లో ఇలాంటి కొన్ని వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి, కానీ ఇలాంటి సెన్సిటివ్ విషయాలను స్ప్రెడ్ చేసేటప్పుడు పూర్తి విషయాలు తెలుసుకుని చేయడం మంచిది అని పలువురు ప్రముఖులు స్పందించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: