మామూలుగా దేవాలయం అంటే ప్రసాదం పంచుతారు .సాధారణంగా ఏ దేవాలయంలో చూసిన ప్రసాదం అంటే  లడ్డు లేదా పులిహోర లేదా పొంగల్ లేకపోతే వడ ఇస్తారని మనకీ తెలుసు. కానీ ఈ దేవాలయం లో ప్రసాదంగా  లడ్డు మరియు పులిహోర ని  అస్సలు పంపిణీ చేయరట .మరి ప్రసాదంగా దేనిని పంపిణీ చేస్తారు . ప్రసాదం  లేకుండా దేవాలయాన్ని ఊహించుకోలేము . మరి ఈ ఆలయం లో ప్రసాదంగా ఏమి పెడతారో  తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్య పోతారు. మరి విషయం లోకి వెళ్దామా..

తమిళనాడు మధురై లోని  మునియాండి స్వామివారి గుడిలో  దశాబ్దాలుగా వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. అదేంటంటే ప్రతి సంవత్సరం  జనవరి 24 నుండి 26 తేదీ వరకు మునియాండి ఆలయంలో  ఆలయ కమిటీ వారు  వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు.  ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా బిర్యానీనీ  పంపిణీ చేయడం తరతరాలుగా  ఆనవాయితీగా వస్తుందని అలయ కమిటీ  వారు అంటున్నారు . ఈ బిర్యానీ ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలో భుజించే సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా ఆ ప్రసాదాన్ని భక్తులు తమ ఇళ్లకు  తీసుకెళ్లే  అవకాశం కూడా ఆలయ కమిటీ ఇస్తున్నారు.  బిర్యానీ ప్రసాదం కోసం భక్తులు పెద్దఎత్తున వస్తారని విరాళాలు కూడా భారీగానే అందిస్తున్నారని కమిటీ సభ్యులు చెబుతున్నారు. మామూలుగా దేవాలయం లో ప్రసాదం అంటే లడ్డు పులిహోర మరియు పొంగలి ఇలాంటి చూస్తూ ఉంటాము . కానీ తమిళ్ నాడులోని ఈ దేవాలయంలో  ప్రసాదంగా బిర్యానీని పెట్టడం అత్య్హంత ప్రాధాన్యతని సంతరించుకుంది . బహుశా ప్రసాదంగా బిర్యానీ పెట్టడం అనేది  ప్రపంచంలోనే మరే దేవాలయం లో చూసి ఉండము . నాన్ వెజ్ ప్రసాదం లో భాగంగా  వరల్డ్ లోనే మునియాండి దేవాలయం  మొదటి స్థానం లో నిలుస్తుంది ఆని చెప్పడం లో  సందేహం వలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: