ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి... మాములుగా మార్కెట్లో టీ పొడి రేటు ఎంతుంటుంది మహా అంటే ఒక పది రూపాయలు నుంచి ఒక ఐదు వందల రూపాయలు దాకా ఉంటుంది. కాని ఈ టీ పొడి మాత్రం ఏకంగా 75 వేల రూపాయలు పలికిందట. ఆ రేటుతో ఒక మధ్య తరగతి కుటుంబం వారు  ఒక మంచి టూ వీలర్ బైక్ నే కొనుక్కుంటారు. లేదా ఒక ఆరునెలలు దాకా సరిపడా సరుకులు కొనుక్కుంటారు... ఇక ఇండియా హెరాల్డ్ అందిస్తున్న పూర్తి వివరాల్లోకి వెళితే....   గౌహతీ టీ ఆక్షన్ సెంటర్ (జిటిఎసీ) ఇటీవల ప్రత్యేకమైన టీని వేలానికి పెట్టింది. దీన్ని కొనుగోలు చేసేందుకు పలు టీ సంస్థలు పోటీపడ్డాయి. దీంతో కిలో టీ రూ.75 వేలకు అమ్ముడుపోయింది. కాంటేంప్రరీ బ్రోకర్స్ ప్రైవట్ లిమిటెడ్ సంస్థ ఈ టీని కొనుగోలు చేసినట్లు జిటిఎబిఎ  సెక్రటరీ దినేష్ బిహానీ వెల్లడించారు.

కరోనా సమయంలో కూడా ఈ టీకి ఇంత ఆధరణ లభించడం చాలా గ్రేట్. ఈ ప్రత్యేకమైన టీ ఉత్పత్తి కోసం దిబ్రూగడ్‌లోని మనోహరీ టీ ఎస్టేట్ సెప్టెంబరు నెలలో ఎంతో శ్రమించారు’’ అని బిహానీ తెలిపారు. సూర్యకిరణాలు ప్రసరించడానికి ముందుగానే.. టీ బడ్స్‌ను కోస్తారు. ఇది చక్కని వాసనతో కూడిన ఈ మేలిరకం టీ తయారీ.. మిగతా వాటితో పోల్చితే చాలా ప్రత్యేకమైనవని మనోహరి టీ ఎస్టేట్ డైరెక్టర్ రాజన్ లోహియా తెలిపారు. గతంలో ఈ టీ రూ.50 వేలు పలికినట్లు వెల్లడించారు.

ఏది ఏమైన కాని ఈ టీ పొడి రేటు మాత్రం కచ్చితంగా షాక్ కి గురి చేస్తుందనే చెప్పాలి. ఈ టీ పొడిని బాగా డబ్బున్న ధనవంతులు తప్ప పేదవాళ్ళు కాని, మధ్య త్వరగతి వాళ్ళు కాని కొనుక్కోలేరు. ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కొరకు ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి: