ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బిగ్ బాస్ అన్ని సీజన్ల 4వ సీజన్ గొడవలు టాస్కులతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతూ ‘రేస్ టు ఫినాలే’కి అడుగుపెట్టింది. చివరి వారాలు కీలకం కానుండటంతో ఫినాలేకి వెళ్లేది ఎవరు? ఆటలో నిలిచేది ఎవరు అన్నది ఆసక్తిగా మారింది. ఇక హౌస్ విషయానికి వస్తే.. జలజ అనే దెయ్యం ఇంటి సభ్యులతో ఆట ఆడుకుంటోంది. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యుల్ని ముప్పుతిప్పల్ని పెడుతుంది. ఇక ‘రేస్ టు ఫినాలే’లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య ఫిటింగ్ పెడుతూ మీలో ఎవరు బెస్ట్ కెప్టెన్?? ఎవరు వరస్ట్ కెప్టెన్ తేల్చుకోవాలని బిగ్ బాస్ ఫిటింగ్ పెట్టడంతో ఇంటి సభ్యులు నేనంటే నేను అంటూ రచ్చకు దిగారు ఆ ముచ్చట్లతో శుక్రవారం నాటి 83 వ ఎపిసోడ్‌లో హౌస్ మేట్స్ కి ఇచ్చిన టాస్కులో వారు విఫలమయ్యారు...

ఈ టాస్క్‌లో ఎందుకు విఫలం అయ్యారో.. ఎక్కడ పొరపాటు జరిగిందో ఇంటి సభ్యులు చర్చించుకుని అభిప్రాయాన్ని బిగ్ బాస్‌కి తెలియజేయాలని చెప్పారు. అయితే వీరి చర్చల్లో భాగంగా అవినాష్ తనకు ఇచ్చిన టాస్క్‌ని చేశానని.. అఖిల్-మోనాల్‌లు డేట్‌కి వెళ్లారని చెప్తూ.. అభిజిత్ పేరుని ప్రస్తావించాడు.
దీంతో అభిజిత్ రియాక్ట్ అవుతూ.. నా పర్శనల్ విషయం నేను మాట్లాడతా కానీ.. ఈ టాస్క్ బిగ్ బాస్ ఇస్తున్నారో వేరే వాళ్లు చేయిస్తున్నారా? అనే కన్ఫ్యూజన్ అయితే ఉంది. బిగ్ బాస్ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చిన తరువాతే ఇది లగ్జరీ బడ్జెట్ టాస్క్ అని తెలిసింది’ అని చెప్పాడు.

ఇక మోనాల్‌తో డేట్ విషయం గురించి బిగ్ బాస్‌తో మాట్లాడుతూ.. ‘మోనాల్‌తో డేట్‌కి వెళ్లాలని పంపిన లెటర్ వల్ల నేను పర్సనల్‌గా హర్ట్ అయ్యా.. ఆ లెటర్‌లో మీరు ఫ్రేమ్ చేసిన పదాలు (అఖిల్, అభిజిత్‌లు మోనాల్‌ని ఏడిపించారు) నాకు అర్థంకాలేదు.. ఆమెను నేను ఏడిపించాను అంటే పర్సనల్‌గా హర్ట్ అయ్యా.. అందుకే టాస్క్‌లో పెర్ఫామ్ చేయలేదు. 12వ వారాల జర్నీలో నేను హర్ట్ అయ్యా.. అందుకే దీన్ని పర్శనల్‌గా తీసుకున్నా. ఒకవేళ నా వల్ల మిస్టేక్ జరిగితే క్షమాపణ కోరుతున్నా’ అని క్లారిటీ ఇచ్చాడు అభిజిత్. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌నే సరిగా లేదని.. క్లారిటీ లేకుండా టాస్క్‌లు ఇచ్చి.. చెట్లు ఆకులు లెక్కపెట్టాలి.. డేట్ చేయాలి లాంటి పిచ్చి టాస్క్‌లు ఇస్తే ఎవరు చేస్తారు.? అభిజిత్ రిజెక్ట్ చేయడమే కరెక్ట్ అంటున్నారు అతని ఫ్యాన్స్. అంతేకాదు ఈ పిచ్చి టాస్క్‌లో అభిజిత్‌ని వరస్ట్ పెర్పామర్ అనడం పట్ల హర్ట్ అవుతున్నారు అభి ఫ్యాన్స్.దీనిపై బిగ్ బాస్ యాజమాన్యం పై తీవ్రంగా మండిపడిపోతున్నారు అభి ఫ్యాన్స్... మొన్న మోనాల్ విషయంలో అభి ని ఫస్ట్ టైం ఏడ్చేలా చేశారని అభిజిత్ ఫ్యాన్స్ కోప్పడుతున్నారు.నెట్టింట్లో ఈ ఇష్యూ ఇప్పుడు చాలా వైరల్ అయ్యింది...ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి: