ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..రోనా వైరస్ కారణంగా ఏవైనా పెళ్లి వేడుకలు జరపాలన్న శుభ కార్యాలు  జరపాలన్న  పెద్ద కష్టంలా మారింది ప్రస్తుతం. ఎక్కువ మంది అతిథులను పిలిచి ఘనంగా వేడుకలు జరుపుకోవాలంటే చాలా కష్టమైనా పనిలా అయ్యింది. ఇక పెళ్లిలైతే పూర్తిగా కళతప్పుతున్నాయి. వైరస్ వల్ల పెళ్లికి హాజరయ్యే అతిథుల సంఖ్య తగ్గడం వల్ల చదివింపులు (నగదు బహుమతులు) కూడా రావడం లేదు. ఈ క్రమంలో తమిళనాడులోని మధురైకు చెందిన ఓ కుటుంబం సరికొత్త ఐడియాతో ఒక మాస్టర్ ప్లాన్ వేసింది.

తమ పెళ్లి వేడుకకు అతిథులు వచ్చినా రాకపోయినా.. చదివింపులు తగ్గకుండా  ఉండేందుకు డిజిటల్ బాట పట్టారు. శుభలేఖలపై ఏకంగా క్యూ ఆర్  కోడ్‌నే ముద్రించారు. గూగుల్ పే, ఫోన్‌పే అకౌంట్లకు చెందిన క్యూ ఆర్  కోడ్లను స్కాన్ చేసి.. వధువరులకు నగదు చెల్లించగలరని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెళ్లి కుమార్తె తల్లి టీజే జయంతి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 30 మంది క్యూ ఆర్  కోడ్ ద్వారా నగదు చదివించారని తెలిపారు. అయితే, ఈ శుభలేఖ  వైరల్ కావడం వల్ల చాలామంది ఫోన్లు చేస్తున్నారని, ఐడియా బాగుందని మెచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ న్యూస్ గా మారింది.. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: