ఇకపోతే వీరి మనస్సు చాలా పవిత్రంగా ఉంటుంది అని దేవుడితో సమానం అని కూడా కొంతమంది చెబుతున్నారు. అంతేకాదు వీరితో ఆశీర్వాదం తీసుకుంటే, మనకు జీవితంలో అన్ని వేళలా మంచే జరుగుతుందని అంటారు.. రామాయణం వంటి పౌరాణిక గాథలో కూడా హిజ్రాల గురించి ప్రత్యేక వర్ణణ కూడా ఉంది. అయితే రామాయణంలో రాముడు.. సీత, లక్ష్మణుడు తో కలిసి వనవాసానికి వెళ్ళినప్పుడు వారి వెంట ఆ గ్రామ ప్రజలు వస్తారు.. కొంత దూరం వెళ్ళిన తరువాత రాముడు ఆడ ,మగ వాళ్ళు ఇంటికి వెళ్లిపోండి అని ఆదేశిస్తాడు.
అయితే రాముడు వనవాసం ముగించుకొని తిరిగి అయోధ్యకు వస్తున్న సమయంలో.. హిజ్రాలు అక్కడే ఉంటారట. వీరిని చూసిన రాముడు మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి..? అని అడగగా అప్పుడు వాళ్ళు మమ్మల్ని వెళ్లమనలేదు కదా.. ప్రభు..! అని అన్నారట.అంటే ఆడ ,మగ వాళ్ళను మాత్రమే వెళ్ళమన్నారు.. మమ్మల్ని వెళ్ళమనలేదు కదా..? అని అనగానే.. వీళ్ళు హిజ్రాల ని గుర్తించాడు రాముడు. ఇక అలా మొదటిసారి శ్రీరాముడు హిజ్రాలను వనవాసం నుంచి వచ్చిన తర్వాత చూశాడు.. కాబట్టి వీరిని దైవాంశ సంభూతులు గా చెబుతారు.
ఇక సాధారణ ప్రజల జీవన శైలి కంటే, వీరి జీవన శైలి చాలా విభిన్నంగా ఉంటుంది ..వీరిలో ఎవరైనా చనిపోతే ప్రజలు ఎవరు చూడని సమయంలో ,అంటే అర్ధరాత్రి సమయంలో స్మశానానికి తీసుకెళ్లి దహనసంస్కారాలు చేస్తారట. హిజ్రాలు చనిపోయినప్పుడు దహన సంస్కారాలను ఎవరైనా మామూలు మనుషులు చూస్తే, వారికి చాలా మంచి జరుగుతుందట.. మరి కొంతమంది తాము జీవితంలో బాగుండాలని హిజ్రాలను ప్రత్యేకంగా పిలిపించి మరీ వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. అసలు విషయానికి వస్తే ,మనం మంగళవారం 11 రూపాయలు లేదా 21 రూపాయలను హిజ్రాలకు దానంగా ఇవ్వాలి.. వారికి ఇస్తూ.. నేను రేపు మళ్ళీ వస్తాను.. అందులో ఏదో ఒక నాణెం నాకు తిరిగి ఇవ్వాలని అడిగాలట.. అలా తెల్లవారుజామునే వారి దగ్గరకు వెళ్లి వారు ఇచ్చిన డబ్బులు తీసుకువచ్చి , ఎర్ర బట్టలో కట్టి ప్రతి రోజు పూజ చేయడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి