ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత శరవేగంగా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ పై అవగాహన రావడంతో ఎవరూ ఒత్తిడి చేయకుండానే స్వచ్ఛందంగా వ్యాక్సిన్లు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు  ప్రతి ఒక్కరు. దీంతో టీకా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకున్న అన్ని లక్ష్యాలు నెరవేరుతున్నాయ్. అయితే టీకా పై ప్రతి ఒక్కరిలో ఎంతో అవగాహన పెరిగిపోయింది అనడానికి ఇటీవల భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 100 కోట్ల మార్కును అందుకోవడమే ఒక ప్రూఫ్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా టీకా పై అవగాహన తో వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు.



 అయితే మొదట్లో వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సమయం లో ఎంతోమంది లో వ్యాక్సిన్పై ఎన్నో అపోహలు అనుమానాలు ఉండేవి. టీకా వేసుకోవడం వల్ల ప్రాణాలు పోతున్నాయి భావించి ఎంతో మంది  వ్యాక్సిన్ కి దూరంగానే ఉన్నారు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో అవగాహన వచ్చింది. కానీ ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ అంటే భయంతో వణికి పోతున్నారు అన్నది ఇక ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇటీవలే వ్యాక్సిన్ వేసుకోవడానికి ఓ వృద్ధురాలు భయంతో వణికి పోయింది. ఏడుస్తూ పరుగులు పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో అందరినీ నవ్విస్తూ ఉన్నప్పటికీ ఈ వీడియో వల్ల ఇంకా చాలా మంది వ్యాక్సిన్పై అవగాహన లేని వారు ఉన్నారు అన్నది మాత్రం తెలుస్తుంది.



 యాదాద్రి భువనగిరి జిల్లా లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం గ్రామ వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ వేసుకోని వారికి టీకాలు వేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా లో వాలంటీర్లు వ్యాక్సిన్ వేయడానికి వెళ్లారు. ఇంతలో వాళ్లను చూసిన ఒక వృద్ధురాలు భయంతో వణికి పోయింది. తనకు ఎక్కడ బలవంతంగా వ్యాక్సిన్ ఇస్తారో అని ఏకంగా ఆర్తనాదాలు చేస్తూ పరుగులు పెట్టింది. ఆమెను పట్టుకునేందుకు ఎంతమంది ప్రయత్నించినా కూడా కుదరలేదు. ఏకంగా వాలంటీర్లకు దొరకకుండా పరుగులు పెట్టింది ఆ వృద్ధురాలు. ఇక ఇదంతా పక్కనే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: