పాములు చూడగానే చాలా మంది భయంతో వణికిపోతారు. ఎందుకంటే అది విషసర్పం కాబట్టి అంత దూరంలో పాము కనిపిస్తే చాలా మంది భయం తో పరుగులు పెడతారు.. మాములు చిన్న పామును చూస్తె అందరూ బిత్తర పొథారు.. అలాంటిది తాచుపామును చూసారంటే చెమటలు పడటం ఖాయం. ఇక ప్రాణాలతో పోరాడుతున్నా తాచుపాముకు వైద్యం చేశారు.వామ్మో వినడానికి భయంగా ఉంది కదా.. అవును మీరు విన్నది నిజమే..ఓ పాముకు వైద్యం చేశారు.. ఇది నిజంగా ధైర్యానికి సంబంధించిన విషయం అని చెప్పాలి.


తాచుపాముకు గాయాలైతే.. నేవి అధికారులు దానికి చికిత్స చేసి సమీప అడవుల్లో వదిలేశారు. అవును మీరు వింటున్నది, చూస్తున్నది నిజమే.. సాదారణంగా పామును చంపుథారు, లేదా పట్టుకుని సమీప అడవుల్లో వదిలెస్తారు.ఇక్కడ దెబ్బలు తగిలిన నాగుపాముకు సమీపం లోని వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్లి మరీ వైద్యం చేయించారు. అనంతరం దానిని అడవుల్లో వదిలేసారు. ఈ ఘటన ఎక్కడో కాదు మన అంధ్రప్రదేశ్ లో వెలుగుచూసింది..


వివరాల్లొకి వెళితే.. విశాఖపట్నం లో జరిగింది. మల్కాపురం లోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయం లో వెలుగు చూసింది. తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయంలో తాచుపాము కలకలం సృష్టించింది. వాహనాల పార్కింగ్ ప్రాంతం లో పామును చూసిన అధికారులు  వెంటనే పాములను పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. వెంటనే అతను వచ్చి పామును పట్టుకున్నారు. పాము ఒంటి పై గాయాలుండడం తో చికిత్స చేయించాలని నేవీ అధికారులు భావించారు. పాముకు పరిమిత స్థాయిలో మత్తు ఇచ్చి గాయాలైన చోట కుట్లు వేశారు. అనంతరం పాముకు స్పృహ వచ్చాక సమీపం లోని కొండ ప్రాంతం లో వదిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. దెబ్బలు తగిలిన నాగుపాముకు సమీపంలోని వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్లి మరీ చికిత్స చేయించడం గ్రేట్ అంటూ కామెంట్లు అందుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: