ఇంకా మాటలు కూడా నేర్వని ఆ చిన్నారి.. అకస్మాత్తుగా సాంబార్లో పడిపోయి మరణించడం తీవ్ర శోకసంద్రంలో ముంచి వేసిందీ. పూర్తి వివరాల్లోకి వెళితే కృష్ణాజిల్లాలోని విసన్నపేట అనే గ్రామంలో ఒక ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుండగా తల్లిదండ్రులు ఆ పాపను తీసుకెళ్లారు.. ఫంక్షన్ జరుగుతుండగా ఉన్నట్లుండి ఆ చిన్నారి కుర్చీలో నుంచి వేడిగా ఉన్న సాంబార్ పాత్రలో పడిపోయింది.. బాగా వేడిగా ఉన్న సాంబార్లో చిన్నారి పడేసరికి ఆ వేడికి తట్టుకోలేక అమ్మాయి చర్మమంతా గాయాలపాలు అయింది. ఇక వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించి.. చికిత్స పొందుతూ ఉండగా మధ్యలోనే చిన్నారి మృతి చెందింది.
ఇక ఆ రెండు సంవత్సరాల చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక ఇలాంటి సంఘటనలను రోజుకొకటి చూస్తూనే ఉంటాం. ఒక జంట తల్లిదండ్రులు గా మారడానికి ఎన్నో కలలు కంటూ ఉంటుంది. అయితే భగవంతుడు ఆ వరాన్ని ప్రసాదించిన తర్వాత చక్కగా కాపాడుకుంటూ వారిని ప్రయోజకుల్ని చేయాలి కానీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రాణాలను బలి తీయడం మహా పాపం అని చెప్పవచ్చు. ఇక మనకు ఎన్ని పనులు ఉన్నా సరే పిల్లల జాగ్రత్తలు ముఖ్యం.. కాబట్టి వారిని కంటికి రెప్పలా 24 గంటలు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అప్పుడే పిల్లలు ఇలాంటి దుర్ఘటనలు పాలు కాకుండా ఉంటారు.. అభం శుభం తెలియని చిన్నారులు ఏమి చూడకనే మరణించడం బాధాకరం అని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి