దాంతో అధికారులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందిని తీసుకుని వెళ్లి ఆ మంటలను అదుపు చేశారట. దాదాపుగా నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పి వేసినట్లు అధికారులు తెలియజేశారు. మొత్తం 13 అగ్నిమాపక యంత్రాలను ఆ మంటలు ఆర్పడానికి ఉపయోగించిన్నట్లుగా సమాచారం. ఇక మిగతా విషయాలకు సంబంధించి తెలుసుకుందాం.
గోకుల్పూరి పిఎస్ ప్రాంతంలో ఈ రోజున తెల్లవారు జామున అగ్రిప్రమాదం చోటుచేసుకున్నది. గుడిసెల లో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి.. ఇక అంతే కాకుండా అర్ధరాత్రి కావడంతో ఎక్కువగా నిద్రిస్తూ ఉండడంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం కూడా ఎక్కువగా సంభవించినట్లు అక్కడ ఉండే స్థానికులు సమాచారాన్ని అందించారు.
ఈ అగ్నిమాపక ప్రమాదంలో మొత్తం మీద ముప్పై గుడిసెలు పూర్తిగా బూడిదయ్యాయి.. మరొక 30 గుడిసెలు మంటలు అంటుకొని ఉండగా వాటిని ఆర్పివేశారట. ఇక ఈ సంఘటనలో ఏడు మంది ప్రాణాలు కోల్పోయినట్టు గా అక్కడ పోలీస్ అధికారులు సమాచారాన్ని అందించారు. వీరి సేవలను రెస్క్యూ టీం తో వెలికి తీయించినట్లు అదనపు ఈశాన్య ఢిల్లీ డిసిపి తెలియజేశారు. అయితే ఇంకా ఆ మంటల్లో ఎవరైనా ఉన్నారా అని అగ్నిమాపక సిబ్బంది వెతుకుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి