సాధారణంగానే నచ్చిన ఆహారం కనిపిస్తే చాలు నోట్లో లాలాజలం అనేది ఆటోమాటిక్‌గా ఊరుతుంది. ఇష్టమైన ఫుడ్‌ను తినేవరకు నాలుక లాగుతూనే ఉంటుంది.అయితే ఇది కేవలం మనుషులకే కాదు.. భూమిపై ఉన్న ఏ జీవరాశికైనా కూడా ఇది వర్తిస్తుంది. పాపం ఇక్కడ ఓ కుక్క కూడా సేమ్ అదే పరిస్థితిని ఎదుర్కొంది. కళ్లెదుట ఇష్టమైన మాంసం ముక్క కనిపించినా కూడా అందుకోలేక అవస్థలు పడింది ఆ కుక్క. అయితే ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అది టీవీలో కనిపిస్తున్న మాంసం అని తెలియక, దాన్ని నిజమైన మాంసమే అని భ్రమ పడుతూ ఆవురావురుమని తెగ ఆరాటపడింది. ఇక దీనికి సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ తెగ రచ్చ రచ్చ చేస్తోంది.ఇంతకీ ఆ వీడియోలో ఏముందో మనం ఇప్పుడు చూద్దాం.. ఇంట్లోని వ్యక్తులతో పాటు ఆ పెంపుడు కుక్క కూడా టీవీ వీక్షిస్తోంది. ఇంతలో ఆ టీవీలో అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది. ఇక అందులో మాంసం ముక్కలు కనిపించడంతో.. ఆ టీవీ ముందు కూర్చున్న కుక్కకు ఒక్కసారిగా నోరూరింది. 


వెంటనే ఆ ముక్కను అందుకోవాలని అది ప్రయత్నించింది. కానీ పాపం.. అది నిజమని తెలియని ఆ కుక్క.. టీవీ స్క్రీన్‌ను నాకుతూ దాన్ని ఆస్వాధించింది. అయితే, ఆ కుక్క అలా చేయడాన్ని వీడియో తీసిన యజమాని.. ఆ సంబంధిత వీడియోను MyChinaTrip అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 'ఇది రుచికరమైన ఫుడ్' అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ కుక్క ఆత్రుతను చూసి నెటిజన్లు తెగ ఫిదా అయిపోతున్నారు. మాంచి కరువులో ఉన్నట్లుంది అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.ఇక వీడియోకు 9.1 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా ఇంకా 65 వేల పైగా లైక్స్ వచ్చాయి. బాగా వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోనూ మీరూ చేసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: