సాధారణమైన విషపూరిత పాములు కరిస్తేనే పరిస్థితి ఇలా ఉంటుంది. అలాంటిది ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటైన కింగ్ కోబ్రా కరిసింది అంటే ఇక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవడమే అని ఎంతో మంది నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తిని కింగ్ కోబ్రా కాటేసినప్పుడు సదురు వ్యక్తికి బదులు ఏకంగా పాము చనిపోవడం గురించి ఎప్పుడైనా విన్నారా అంటే.. ఇలాంటివి కేవలం సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. నిజ జీవితంలో మాత్రం ఇలాంటివి జరగడం అసాధ్యం అని అంటారు ఎవరైనా. కానీ ఉత్తర్ ప్రదేశ్ లో మాత్రం ఇలాంటి ఒక వింత ఘటన జరిగింది.
మనిషిని కాటేసిన కింగ్ కోబ్రా చివరికి ప్రాణం వదిలింది. ఫుల్లుగా మద్యం సేవించిన ఒక వ్యక్తి కృషినగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర విభాగానికి వచ్చాడు. అయితే వెంటనే డాక్టర్ల వద్దకు వెళ్లి కింగ్ కోబ్రా తనను రెండు సార్లు కాటు వేసిందని చెప్పాడు. కానీ కింగ్ కోబ్రా తనను కాటేసిన కొద్దిసేపటికి చనిపోయిందని చెప్పాడు. వైద్యులకు నమ్మకం కుదుర్చటానికి ఏకంగా చనిపోయిన కింగ్ కోబ్రాను పాలిథిన్ కవర్లో వేసి హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. అయితే మొదట కవర్లో పామును చూసి షాక్ అయిన డాక్టర్లు తరువాత సదరు వ్యక్తికి ఐసీయూలో చికిత్స చేశారు.ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి