సాధారణంగా చిన్నపిల్లలు చేసే పనులు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక చిన్న పిల్లలు చిలిపిగా ఏ పని చేసిన  కూడా వారిని ఒక్కసారిగా మనసుకు హత్తుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అంతలా ముద్దు ముద్దుగా అనిపిస్తూ ఉంటాయి. అయితే కేవలం చిన్నపిల్లలు మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు జంతువులు చేసే చిలిపి పనులు కూడా అందరికీ మనసును హత్తుకుంటూ ఉంటాయని చెప్పాలీ. అచ్చంగా ఏకంగా చిన్నారులు మారం చేసినట్లుగానే జంతువులు సైతం మారం చేయడం లాంటి వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి..


 ముఖ్యంగా పాండా చేసే చిలిపి పనులు అందరికీ నవ్వులు తెప్పిస్తూ ఉంటుంది. ఎందుకో ఏమో కానీ పాండా ఎప్పుడు కనిపించినా కూడా అందరిలో కాస్త ఉత్సాహం అలుముకుంటుంది అని చెప్పాలి. అందుకేనేమో ఇక పాండాలకు సంబంధించి ఏదైనా వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది క్షణాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సాధారణంగా పాండాలు మంచు ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. ఇక అక్కడి మంచును ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 వైరల్ గా మారి పోయిన వీడియో లో చూసుకుంటే ఒక పాండా ఏకంగా మంచు లో చిన్న పిల్లాడి లాగా ఆడుకుంటుంది. మంచూలో దొర్లుతూ తెగ ఎంజాయ్ చేస్తుంది అని చెప్పాలి. ఇక ఇలా వీడియోలో పాండా చేసే చిలిపి చేష్టలు అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి. అంతే కాదు మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇది చూసిన నెటిజెన్లు ఇలాంటి పాండాతో ప్రేమ లో పడకుండా ఎవరుంటారు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: