దాదాపు ఎండాకాలం స్టార్ట్ అయినట్లే .. ఈ క్రమంలోనే క్రమక్రమంగా ఎండల తీవ్రత కూడా పెరిగిపోతోంది.. ఈ క్రమంలోనే ఎంతో మంది జనాలు ఈ ఎండాకాలంలో ఎక్కడ కి వెళ్లి చిల్ అవుదామా అని ఇప్పటినుంచే ప్లాన్స్ వేసుకోవడం మొదలుపెట్టారు అని చెప్పాలి. అయితే ఎండాకాలంలో కేవలం మనుషులు మాత్రమే కాదు అటు పక్షులు జంతువులు సైతం ఇలా చిల్ అవ్వడానికి కొన్ని ప్రదేశాలను ఎంచుకుంటూ ఉంటాయి. ఆయా ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే పక్షులు సైతం ఇక వాటి భాషలో మనుషుల్లాగానే ఆటపాటలు బాగా ఎంజాయ్ చేసిన విషయం అందరికీ తెలుసు.



 కొన్ని కొన్ని సార్లు ఇలా కొలనులో పక్షులు చేసే విన్యాసాలు అయితే అందరినీ అబ్బురపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతూ అందరి హృదయాలను తాకుతూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. రెండు బాతులు ఏకంగా కొలనులో అటు ఇటు ఈదుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. అదే సమయంలో అద్భుతమైన డాన్స్ తో ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ఇలా కొలనులో బాతులు డాన్స్ చేయడం చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.


 ఇక ఇలా వీడియోలో కనిపించిన రెండు బాతులకు కూడా ఎవరో డాన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడేమో అన్నట్లుగానే రెండు బాతులు కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఉన్నాయి. నాటు నాటు పాటలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకే లాగా స్టెప్పులు వేసినట్లు.. ఈ రెండు బాతులు కూడా హ్యాపీ మూడ్లో ఒకే రీతిలో స్టెప్స్ వేస్తూ ఉన్నాయి. ఈ వీడియో చూడడానికి ఎంతో ముచ్చట గొలిపేలా ఉన్నప్పటికీ.. బాతులు ఇలా వింతడాన్స్ చేయడం చూసి  నేటిజన్స్ అందరు మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: