అయితే ఇలా పర్యటకుల్లాగా సఫారీ వాహనాల్లో జంతువుల దగ్గరికి వెళ్లే అవకాశం లేనివారు.. సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే వీడియోలు చూడటం ద్వారా సంతృప్తి పొందుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఇలా అడవిలో జంతువుల వేటకు సంబంధించి చాలానే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే అడవిలో పులి, చిరుత సహ మరికొన్ని రకాల ప్రమాదకరమైన జంతువులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న సింహం మాత్రం అడవికి రారాజు అని పేరు సంపాదించుకుంది. ఎందుకంటే సింహం గర్జన వింటేనే అడవిలో ఉన్న మిగతా జంతువులన్ని వణికిపోతూ ఉంటాయి.
సింహానికి భయపడినట్లుగా.. ఇంకే జంతువుకు కూడా మిగతా జంతువులు భయపడవు అని చెప్పాలి. అందుకే సింహాన్ని రాజు అని అంటూ ఉంటారు. ఒకవేళ సింహం ఒక్కసారి వేటాడాలని ప్రయత్నించింది అంటే.. చాలు వాటి కంటపడ్డ జంతువుకి అదే చివరి రోజు అవుతుంది. ఇక ఇక్కడ సింహాలు ఏకంగా ప్రమాదకరమైన మొసలితో ఒక ఆట ఆడుకున్నాయి. సింహాలు ఉండే చోటుకు వెళ్ళింది మొసలి. వాటి ఆహారాన్ని లాక్కోవడానికి ప్రయత్నించింది. వెంటనే సింహాల గుంపు అక్కడికి చేరుకుంది. ఇక మొసలికి తమ బలాన్ని చూపించడం మొదలుపెట్టాయి సింహాలు. ఈ క్రమంలోనే రెండు వైపులా నుంచి దాడి చేసి మొసలిని సింహాలు తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ వీడియో వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి