ఏప్రిల్ 22న పహల్గాం లో ఉగ్రవాదుల దాడి ఒక్కసారిగా ఇండియా అంతట భయభ్రాంతులకు గురిచేస్తుంది. అయితే సాధారణ పౌరులని చంపడంతో ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గానే నిర్ణయం తీసుకుంది. దీంతో ఉగ్రవాదుల స్థావరాలనే కాకుండా ఇల్లను కూడా ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను కాల్చి చంపినప్పటి నుంచి అటు పాకిస్తాన్ ఇండియా మధ్య చిచ్చు మొదలైంది. ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనే విధంగా ఆధారాలు లభించడంతో ఇండియా ఎప్పుడు ప్రతికారం తీర్చుకోవడానికి దిగుతుందనే విషయం పైన పాకిస్థాన్ భయపడుతూ ఉన్నది.


అయినా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు పాకిస్థాన్. తాజాగా పాకిస్థాన్ సమాచార మంత్రి అయిన అత్తల్లా తరార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఢిల్లీకి సైతం హెచ్చరికలను పంపించారు.పాకిస్థాన్ సమాచారం మంత్రి మాట్లాడుతూ భారత్ రాబోయే 24 నుంచి 36 గంటలలో సైనిక దాడికి ప్రణాళికలు చేస్తోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయంటూ తెలిపారు.. పహల్గాం దాడి వెనుక ప్రమేయం ఉందని న్యూఢిల్లీలో కల్పిత రాతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సైనిక దురాక్రమణ చర్యలకు పాల్పడేందుకు ఇలాంటి వాదనలు చేస్తున్నారనే విధంగా పాకిస్థాన్ సమాచారం మంత్రి వాదనలను వినిపించారు.


పాకిస్థాన్ కూడా ఉగ్రవాద దేశమని భారత చేస్తున్న ఈ ఆరోపణలను ఖండిస్తున్నామంటూ తెలియజేశారు. పారదర్శక దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పినా కూడా భారత్ వినలేదని ఘర్షణ మార్గమే ఎంచుకుంటున్నదంటే తెలియజేశారు.. ఒకవేళ తమ దేశం పైకి సైనిక చర్యలను పంపితే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. రక్షణ మంత్రి అధికారులతో ప్రధాన మోడీ సమావేశమైన తరువాతే ఈ ప్రకటనలను చేశారు.


భారత్ సైనిక దాడి చేస్తుందనే విషయం తెలియగానే..పాకిస్థాన్ సైన్యంలో ఒక్కసారిగా అలజడలు మొదలయ్యాయి. సుమారుగా 5000 మంది సైనికులు రిజైన్ చేశారట వీటికి తోడు లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ అహ్మద్ రాసిన లేఖలో ప్రకారం.. 72 గంటలలో 250 మంది అధికారులతో పాటుగా 1,450 మంది సైనికులు కూడా ఆర్మీ నుంచి రాజీనామా చేసి వెళ్లిపోయారని వీరే కాకుండా మరి కొంతమంది కూడా రిజైన్ చేసి వెళ్లిపోయారని తెలియజేశారు. ఇక మోదీ కూడా పహల్గాం దాడి చేసిన వారిని ఎక్కడ ఉన్నా కూడా శిక్షించి తీరుతామంటూ ప్రతిజ్ఞ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: