
గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా కంటి గురించి బ్యాక్ పెయిన్ గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి . కంప్యూటర్ స్క్రీన్ చూడడానికి అద్దాలు బాగున్నాయో లేదో చూసుకోండి . కచ్చితంగా కంప్యూటర్ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా తగిన అద్దాలు వాడడం మంచిది. అంతేకాదు మీ కంప్యూటర్ స్క్రీన్ బ్రైట్నెస్ ని కూడా తగ్గించుకోవడం మరింత మంచిది . అదేవిధంగా తినే ఆహారాలలో కొన్ని కొన్ని కాయగూరలు ప్రధానంగా ఉంచుకోవడం మీకే మంచిది . క్యారెట్ - బ్రోక్లీ - ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం మీ కళ్ళకు చాలా చాలా మంచిది.
అదే విధంగా గంటలు గంటలు కుర్చీలో కూర్చొని ఉండడం వల్ల ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. మరీ ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగాలు చేసే తల్లులకు బ్యాక్ పెయిన్ మరింత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ డెలివరీ సమయంలో తీసుకున్న మెడిసిన్స్ కారణంగా కావచ్చు.. లేకపోతే ఆపరేషన్ చేసే మూమెంట్లో వెన్ను ఎముకకు ఇచ్చే ఇంజక్షన్ కారణంగా కావచ్చు.. ఎక్కువగా కుర్చీలో కూర్చున్నప్పుడు బెండ్ అవ్వకుండా బ్యాక్ దిండు సపోర్ట్ పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు మార్కెట్లోకి రకరకాల టేబుల్స్ -చైర్స్ అందుబాటులోకి వస్తున్నాయి అవి కూడా ఉపయోగించడం మంచిది .
అంతే కాదు కచ్చితంగా కంప్యూటర్ ముందు కూర్చునే ప్రతి ఒక్కరు కూడా 20 నిమిషాలకు ఒకసారి లేచి ఒక పది అడుగులు వేసైనా సరే మళ్లీ కూర్చొని వర్క్ చేసుకోవడం చాలా చాలా మంచిది అంటున్నారు డాక్టర్లు. లేకపోతే బ్లడ్ సరఫరా అనేది సరిగ్గా జరగదు అని ఎక్కువగా అలాగే కూర్చుని ఉండడం వల్ల కూడా మన ఆరోగ్యంలో మార్పులు కనిపిస్తాయని .. మరీ ముఖ్యంగా షుగర్ వచ్చే ఛాన్స్ ..కాళ్ల వాపులు పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చిన్న ఏజైనా పెద్ద ఏజ్ అయిన ఎవరైనా కంప్యూటర్ ముందు గంటలు గంటలు కూర్చుని ఉంటే ఆ పద్ధతిని మానుకోవాలి పది నిమిషాలకు ఒకసారి అయినా ఒక్కసారి లేచి అలా రెండు అడుగులు వేసి మళ్ళీ కూర్చుని వర్క్ చేయడం చాలా చాలా మంచిది అంటున్నారు డాక్టర్స్..!