ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల సమస్యలు వస్తాయని తెలిసినా కూడా, ఆ విషయం పట్టించుకోకుండా ఫోన్‌ను ఒక స్టైల్‌గా, ఒక మోజుగా భావిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల కంటి సమస్యలు, తలనొప్పులు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.ఇక మరోవైపు, గేమ్స్ మోజు అయితే మరింత ప్రమాదకరంగా మారుతోంది. చాలామంది యువకులు, విద్యార్థులు గేమ్స్‌కు బానిసలై తమ బంగారు భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో గేమ్స్ కారణంగా తమ చదువును, కెరీర్‌ను, ఆరోగ్యాన్ని కోల్పోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా చైనాలో వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. చైనాకు చెందిన ఒక యువకుడు ఏకంగా రెండు సంవత్సరాల పాటు ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ పూర్తిగా గేమ్స్‌కు బానిస అయ్యాడట. ఆ గేమ్ మోజులో పడి అతడు తన గదినుంచి బయటకు రావడమే మానేశాడని సమాచారం. ఇది వింటేనే ఆశ్చర్యంగా ఉన్నా, ఇంకా షాకింగ్ విషయాలు మరికొన్ని ఉన్నాయి.అతడు తన తల్లిదండ్రుల ద్వారా బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు వేయించుకొని, అవసరమైన ఆహారం సహా అన్ని వస్తువులను ఆన్లైన్‌లో ఆర్డర్ చేసుకుని గది దగ్గరకే తెప్పించుకునేవాడట. ఇంకా విడ్డూరం ఏంటంటే, బాత్రూం కి వెళ్లే అవసరం వచ్చినప్పుడు కూడా గదిలోనే అక్కడికక్కడే చేసేవాడట. ఆ మురికిని శుభ్రం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదట.
తిన్న తర్వాత మిగిలిన ఫుడ్ ప్యాకెట్లు, చెత్త అంతా గదిలోనే విసిరేసి, దుర్వాసన వస్తున్నా కూడా పట్టించుకోకుండా అదే చెత్త మధ్యలో ఉండిపోయాడట. గేమ్స్‌లో అంతగా లీనమైపోయి తాను ఏమి చేస్తున్నాడో, ఏమి తింటున్నాడో, ఎలా జీవిస్తున్నాడో అన్న స్పృహ కూడా లేకుండా జీవించాడట. ఒక మనిషి గేమ్స్ కారణంగా తన జీవితాన్ని ఎంత దారుణంగా నాశనం చేసుకోగలడో చెప్పడానికి ఇది మరో భయంకరమైన ఉదాహరణగా మారింది.ఈ సంఘటనను చూసి ప్రముఖులు, మానసిక నిపుణులు తల్లిదండ్రులకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పిల్లలకు ఫోన్ ఇవ్వడం తప్పు కాదు, కానీ ఫోన్ ఇచ్చిన తర్వాత వారు దానిని ఎలా వాడుతున్నారు, ఏం చూస్తున్నారు, ఏ గేమ్స్ ఆడుతున్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మానసిక స్థితి ఏంటి అన్న విషయాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.
చైనాలో జరిగిన ఈ సంఘటన ప్రతి తల్లిదండ్రికి ఒక గుణపాఠంలా మారాలి. ఇకపై పిల్లలకు ఫోన్ ఇచ్చేముందు ఆ ఫోన్ వారి జీవితాన్ని నిర్మిస్తుందా లేక నాశనం చేస్తుందా అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత మరింత పెరిగింది. పిల్లలను సరిగ్గా గైడ్ చేయడం, ఫోన్ వినియోగంపై నియంత్రణ పెట్టడం, సమయానుసారంగా వారితో మాట్లాడటం ఎంతో ముఖ్యం.అందుకే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే సంఘటనగా నిలిచింది. మొబైల్ ఫోన్ మన జీవితానికి అవసరం అయినప్పటికీ, దానికి బానిస కావడం మాత్రం ఖచ్చితంగా ప్రమాదకరం అన్న విషయాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి